బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడిగా ఐరిష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుండగా.. రామ్ చరణ్ కు జోడిగా సీత పాత్రలో అలియా నటించనుంది. కరోనా లాక్ డౌన్ లేకపోయుంటే ఈపాటికే అలియా పాత్ర షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యుండేది. ఇటీవలే 'ఆర్.ఆర్.ఆర్' షూట్ తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో ఆలియా నవంబర్ ఫస్ట్ వీక్ లో హైదరాబాద్ కి వచ్చి 'ఆర్.ఆర్.ఆర్' టీమ్ తో జాయిన్ అవుతుందని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం అలియా ఆగమనానికి ఇంకొంత సమయం పట్టనుందని తెలుస్తోంది.
ఇంతకముందు ప్లాన్ చేసుకున్న ప్రకారం ఈరోజు నుంచి అలియా భట్ 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ లో పాల్గొనాల్సి ఉండగా.. రాజమౌళి మరోసారి షూటింగ్ ప్లాన్ చేంజ్ చేశారట. ముందుగా హీరోలు ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబినేషన్ సీన్స్ కంప్లీట్ చేసి వాళ్లకు కాస్త రెస్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఈ నేపథ్యంలో అలియా భట్ వచ్చే నెల డిసెంబర్ మొదటి వారంలో అలియా సెట్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీని ప్రకారమే అమ్మడు హైదరాబాద్ లో అడుగుపెట్టనుంది. కాగా, బాలీవుడ్ లో అలియా భట్ పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో 'ఆర్.ఆర్.ఆర్' ప్రాజెక్ట్ నుంచి ఆమెను తప్పించనున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే రాజమౌళి మాత్రం 'ఆలియా ఫెంటాస్టిక్ పెర్ఫామర్ అని.. ఈ సినిమాలో క్యారక్టర్ కి తను ఫర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని.. తన పర్సనల్ లైఫ్ లో జరిగింది సినిమాకి ఎఫెక్ట్ అవుతుందని అనుకోవడం లేద'ని దీనిపై క్లారిటీ ఇచ్చాడు.