#RRR: ఆలియా పాత్ర ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్‌

Update: 2020-01-30 07:30 GMT
రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్‌ మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌' పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తెలుగు ప్రేక్షకుల్లోనే కాకుండా బాలీవుడ్‌ లో కూడా ఈ సినిమాకు బజ్‌ ను క్రియేట్‌ చేసేందుకు రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆలియా భట్‌ మరియు అజయ్‌ దేవగన్‌ లతో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో ఉన్న కారణంగా బాలీవుడ్‌ ప్రేక్షకులు ఈ సినిమాను ఆధిరిస్తారనే నమ్మకం వ్యక్తం అవుతుంది. ఇదే సమయంలో హిందీలో అంచనాలు పెంచేందుకు ఆలియా భట్‌ పాత్రకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని తన సీత పాత్రకు సంబంధించిన షూటింగ్‌ ను ఆలియా భట్‌ ఇప్పటికే పూర్తి చేసుకున్నట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌.. చరణ్‌.. అజయ్‌ దేవగన్‌ లతో పాటు ముఖ్యమైన నటీ నటులపై చిత్రీకరణ జరుపుతున్నారు. ఇలాంటి సమయంలో ఆలియా భట్‌ ను మళ్లీ షూటింగ్‌ కు తీసుకురావాలని భావిస్తున్నారట. ఆలియా భట్‌ ప్రస్తుతం ఇండియాలో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌. ఆమె పాత్ర ఎంట్రీ చాలా సింపుల్‌ గా ఉండకుండా హైప్‌ క్రియేట్‌ చేసేలా ఉండాలనే ఉద్దేశ్యం తో ఆమెపై ఒక ప్రత్యేకమైన పాటను రూపొందించబోతున్నారట.

ఆ పాటను హిందీ వర్షన్‌ వరకు పెట్టాలి లేదంటే ప్రమోషన్‌ సమయం లో విడుదల చేయాలని యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారట. మొదట ఆలియా భట్‌ పై పాటను చిత్రీకరించడం అయితే ఖాయం అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఆ పాటను ఎప్పుడు ఎలా వాడాలి అనేది చివరి దశలో నిర్ణయం తీసుకోబోతున్నారట. ఆలియాకు జక్కన్న చాలా ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌ లో స్టార్‌ స్టేటస్‌ ను కలిగి ఉన్న ఆమె వల్ల ఖచ్చితంగా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం మార్కెట్‌ అధికం గా ఉంటుంది. కనుక ఆమాత్రం ప్రాముఖ్యత ఇవ్వడం లో తప్పేముంది అంటూ మరికొందరు అంటున్నారు.
Tags:    

Similar News