బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలియాభట్ గర్భందాల్చిన సంగతి తెలిసిందే. అయినా తగ్గేదేలే అంటూ సినిమా షూటింగ్ ల్లో పాల్గొంటుంది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని యధావిధిగా షూటింగ్ ల్ని పూర్తి చేస్తుంది. అందులోనూ ప్రమాకరమైన యాక్షన్ సన్నివేశాల్లో సైతం పాల్గొంది అంటే? అలియా గట్స్ గురించి చెప్పడానికి మాటల్లేవ్. ఆ రకంగా పనిపట్ల..వృత్తి పట్ల తన నిబద్దతని చాటుకుంది.
గర్భం దాల్చిన తర్వాత ఇలాంటివి చేయాలంటే ఎన్నో ధైర్యసాహసాలు ఉండాలి. అలాంటి వాళ్లకే ఇలాంటి ఫీట్లు సాధ్యమవుతాయి. ఆ రకంగా అలియాభట్ నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ప్రస్తుతం అలియా నటించిన `డార్లింగ్స్` రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రచార పనుల్ని దగ్గరుండి మరీ పూర్తి చేస్తుంది. నెలలు నిండుతున్నా అలియా మాత్రం విశ్రాంతి తీసుకోవడం లేదు.
వాస్తవానికి ఈ సినిమా విషయంలో ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇచ్చిన మాటకి కట్టుబడి పని పూర్తిచేస్తుంది. తాజాగా అలియా ముంబైలోని ప్రచారానికి హాజరవుతూ ఇలా కెమారాకి చిక్కింది. ఇక్కడ అలియా భట్ ఎత్తైన పొట్టని గమనించవచ్చు. నెలలు నిండుతున్న సన్నివేశం క్లియర్ గా కనిపిస్తుంది.
దీంతో ఆ పొట్టని బ్లేజర్ తో కవరప్ చేసింది. వదులుగా ఉన్న దుస్తులపై బ్లేజర్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. అయితే ఈ బ్లేజర్ తనది కాదిట. భర్త రణబీర్ కపూర్ బ్లేజర్ తనతో పాటు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. బయటకు వచ్చే క్రమంలో పొట్టని కవర్ చేసేందుకు ఆ బ్లేజర్ ధరిస్తుంది. ఇలా అన్ని రకాల జాగ్రత్తలతో అలియాభట్ ముందుకు సాగుతుంది. `యానిమల్` షూటింగ్ సమయంలో ఈ బ్లజర్ లో రణబీర్ కనిపించారు.
గతంలో ఇదే తరహాలో కరీరనాకపూర్..సోనమ్ కపూర్ కనిపించారు. కరీనా కూడా తను నటించిన సినిమాల ప్రచారం కార్యక్రమాలకు నెలలు నిండుతోన్న సమయంలో హాజరై షాక్ ఇచ్చింది. కరీనాకి అప్పుడు ఆరు నెలలు నిండుతున్నాయి. దీంతో పొట్ట ఉబ్బెత్తున కనిపించినా ధైర్యంగా కెమెరా ముందుకొచ్చింది.
ఈ క్రమంలో కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపించినప్పటికీ వాటిని పట్టించుకోలేదు. అటు పై బేబి బంప్ లుక్ తో సోనమ్ కపూర్..కాజల్ అగర్వాల్ లాంటి వారు నెట్టింట చేసిన రచ్చ గురించి చెప్పాల్సిన పనిలేదు. గర్భం దాల్చిన సమయంలో కాజల్ బేబి ప్రోడక్ట్ ల్ని ఎండార్స్ చేసి కోట్ల రూపాయాలు వెనకేసింది.