డిశ్చార్జ్‌ అయిన ఆలియా.. పెద్ద వేడుకకి ప్లాన్‌

Update: 2022-11-10 07:30 GMT
బాలీవుడ్ స్టార్‌ కపుల్‌ ఆలియా భట్‌.. రణబీర్ కపూర్ ఇటీవల ఆడ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. కపూర్‌ ఫ్యామిలీలో అడుగు పెట్టిన ఆ పాపను చూడటం కోసం సినీ ప్రేక్షకులు మరియు కపూర్ ఫ్యామిలీ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన ఆలియా  భట్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు కొన్ని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆలియా ను స్వయంగా రణబీర్ కపూర్‌ హాస్పిటల్‌ నుండి ఇంటికి తీసుకు వెళ్లడం జరిగింది.

పాపతో కలిసి ఆలియా భట్‌ ను రణబీర్ కపూర్ తన ముంబయిలోని అత్యంత ఖరీదైన ఎనిమిది అంతస్తుల భవనం కు తీసుకు వెళ్లాడట. ఇటీవలే ఆ ఇంటిని రణబీర్ కపూర్ దగ్గర ఉండి హంగులు దిద్దించాడట. తన కూతురు ఆ ఇంట్లో అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా రణబీర్ కపూర్ మరమత్తులు చేయించాడు అంటూ వార్తలు వచ్చాయి.

హీరోయిన్‌ గా ఆలియా భట్ బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్ గా వెలుగు వెలుగుతున్న సమయంలో తల్లి అవ్వడంతో ఇక నుండి ఆమె కెరీర్ ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హీరోయిన్ గా ఆమె నటించబోతున్న సినిమా ల కోసం ఫ్యాన్స్ ఇప్పటికే ఎదురు చూస్తున్నారు. కనుక తల్లి అయిన తర్వాత కూడా ఆలియా నటించబోతున్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

మరో వైపు కపూర్ ఫ్యామిలీ కొత్తగా వచ్చిన పాప కోసం ఒక భారీ వేడుకను ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. పాప యొక్క వేడుక కి బాలీవుడ్‌ ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున అతిథులను ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News