ఎట్టకేలకు ఆలియా భట్ కి నెగెటివ్ అని రిపోర్ట్ వచ్చింది. గత రెండు వారాలుగా ఆలియా కోవిడ్ 19 కి చికిత్స పొందుతూ స్వీయనిర్భంధంలో ఉన్న సంగతి తెలిసిందే. అంతకుముందు ఈ బ్యూటీ రాజమౌళితో ఆర్.ఆర్.ఆర్.. సంజయ్ లీలా భన్సాలీ తో గంగూభాయి కతియావాడీ చిత్రీకరణలతో బిజీ గా ఉంది.
కానీ సడెన్ గా ఆలియాకు కరోనా పాజిటివ్ అని తెలియడంతో అంతా కంగారు పడ్డారు. అసలే పాన్ ఇండియా సినిమాల చిత్రీకరణలు పెండింగులో ఉన్నాయి. పైగా రిలీజ్ తేదీలు ఫిక్స్ చేసుకున్నవి కావడంతో ఆలియా న్యూస్ షాకిచ్చింది. ఇప్పుడు ఆలియా స్వయంగా తనకు నెగెటివ్ అని ప్రకటించడంతో తన దర్శకనిర్మాతలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆలియాతో పెండింగ్ షూటింగుల్ని పూర్తి చేసి రిలీజ్ లకు సిద్ధం చేసేందుకు ఆస్కారం ఉంటుంది.
ఆలియా కోలుకున్నాను అనగానే ఇది బెస్ట్ డే అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. యు ఆర్ ది స్ట్రాంగెస్ట్ అని అభిమానులు తనను విష్ చేశారు. ఇక అభిమానులు స్ట్రాంగెస్ట్ అని పిలిచినందుకు అయినా ఆలియా వెంట వెంటనే పెండింగ్ ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తుందేమో చూడాలి. మరోవైపు రణబీర్ -అమితాబ్ - నాగార్జున వంటి స్టార్లతో కలిసి నటించిన బ్రహ్మాస్త్ర తదుపరి షెడ్యూల్స్ పైనా ప్రమోషన్స్ పైనా ఆలియా దృష్టి సారించాల్సి ఉంటుంది. దీంతో పాటే రణవీర్ సింగ్ కథానాయకుడిగా కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ లోనూ ఆలియా నటించాల్సి ఉంది. ఈ సమ్మర్ లోనే సినిమాని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి తన దర్శకహీరోలందరికి ఇది ఒక గుడ్ డే అనడంలో ఎలాంటి సందేహమేం లేదు. ఆలియా కంటే ముందే కరోనా పాజిటివ్ వచ్చిన భన్సాలీ.. రాజమౌళి.. రామ్ చరణ్ తదితరులు ఇప్పటికే కోలుకున్న సంగతి తెలిసినదే.