కొత్త పెళ్లికూతుర్ని హాలీవుడ్ పరుగులెట్టిస్తుందే!

Update: 2022-05-26 14:30 GMT
బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలియాభ‌ట్ కెరీర్ దేదీప్య‌మానంగా సాగిపోతుంది. ఇటీవ‌లే బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్ లు ఖాఆలో వేసుకుంది. 'గంగూబాయి' గా బాలీవుడ్ బాక్సాఫీస్ నే షేక్ చేసింది. గంగూబాయి క‌తియావాడి స‌క్సెస్ తో అమ్మ‌డి ఇమేజ్ రెట్టింపు అయింది. ఆ వెంట‌నే ఆర్ ఆర్ ఆర్ తో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది.

సీత‌మ్మ పాత్ర‌తో పాన్ ఇండియాలో ఫేమ‌స్ అయింది.  అటుపై చెలికాడు ర‌ణ‌బీర్ క‌పూర్ ని పెళ్లాడి ఓ ఇంటిదైపోయింది. ఆ వెంట‌నే హాలీవుడ్ చిత్రం హార్ట్ ఆఫ్ స్టోన్ లో ఛాన్స్...సినిమా ప్రారంభం అవ్వ‌డం..అలియా అమెరికా  ప్లైట్ఎక్కి వెళ్లిపోవ‌డం అంతా చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఆ సినిమా సెట్స్ కి వెళ్లే ముందు త‌న ఎగ్జైట్ మెంట్ ని ట్విట‌ర్ వేదిక‌గా అభిమానుల‌తో షేర్ చేసుకుంది.

ఇందులో హాలీవుడ్  దిగ్గజాలు గాల్ గోడాట్..మ‌జామీ డోర్న్ వంటి వారితో క‌లిసి తొలిసారి తెర‌ను పంచుకుంటుంది. అయితే ఇందులో అలియా పాత్ర ఎలా ఉంటుంద‌న్న‌ది ఇంత‌వ‌ర‌కూ ఎక్క‌డా లీక్ కాలేదు. హార్ట్ ఆఫ్ స్టోన్ లో భాగ‌మైన మాట త‌ప్ప అలియా పాత్ర స్వ‌రూపం ఎలాంటిద‌న్న‌ది మ‌చ్చుకు కూడా బ‌య‌ట‌కు రాలేదు.

తాజాగా హాలీవుడ్ లీక్స్ ప్ర‌కారం ఈ స్పై థ్రిల్ల‌ర్ లో అలియా మాయా సింగ్ అనే ఇండో-అమెరిక‌న్  ఇంటిలిజెంట్ ఏజెంట్ పాత్ర లో క‌నిపిస్తుంద‌ని చెబుతున్నాయి. ఆ పాత్ర ప‌వ‌ర్ పుల్ గా ఉంటుంద‌ని...ఏజెంట్ గా మాయా సింగ్ పోరాటాలు..నిర్ణ‌యాలు ఆస‌క్తిక‌రంగా ఉంటాయ‌ని స‌మాచారం. అలియా సైతం ఎంతో ఎగ్జైట్ మెంట్ తో షూట్ లో పాల్గొంటుందిట‌.  మొత్తానికి కొత్త పెళ్లికూతుర్ని పెళ్లైన కొత్త‌లోనే హాలీవుడ్ ప‌రుగులు పెట్టిస్తుంద‌న్నది  వాస్త‌వంగా క‌నిపిస్తుంది.  అయితే ఈ ప్ర‌చారంపై ఇంకా ఎలాంటి అధికారిక స‌మాచారం లేదు.

కేవ‌లం జాతీయ మీడియాలో మాత్ర‌మే వ‌స్తోన్న క‌థ‌నాలివి. స్పై థ్రిల్ల‌ర్ గా రూపొందించ‌బ‌డిన ఈ నెట్ ప్లిక్స్ ఒరిజిన‌ల్ మూవీని టామ్  హార్ప‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.  స్కైడాన్స్  మీడియా నిర్మించింది. ఈ ప్రాజెక్ట్ గురించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

ఇక అలియాభ‌ట్ చేతిలో బాలీవుడ్ లో కొన్ని సినిమాలున్నాయి. ఇప్ప‌టికే 'బ్ర‌హ్మ‌స్ర్త 'షూటింగ్ పూర్తి చేసింది. ఈ సినిమా  త్వ‌ర‌లోనే రిలీజ్  కానుంది. 'డార్లింగ్స్'..'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ క‌హాని' చిత్రాల్లో  న‌టిస్తుంది. 'డార్లింగ్స్' చిత్రానికి అలియా నిర్మాత‌గాను వ్య‌వ‌హరిస్తుండ‌టం విశేషం.

Tags:    

Similar News