ఆలియా పై నుంచి క‌ళ్లు తిప్పుకోవ‌డం క‌ష్ట‌మే

Update: 2022-02-04 03:30 GMT
క‌ళాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ ఓ సినిమా చేస్తున్నారు అంటే దానికి అర్థం ప‌ర‌మార్థం బ‌ల‌మైన క‌థ క‌థ‌నాలు ఉంటాయి. అత‌డి సినిమాలో న‌టిస్తే న‌టీన‌టుల కెరీర్ గ్రాఫ్ అమాంతం మారిపోతుంది. ఇప్ప‌టికే స‌ల్మాన్.. ఆదిత్య రాయ్ క‌పూర్.. అజ‌య్ దేవ‌గ‌న్.. హృతిక్ రోష‌న్.. ర‌ణ‌వీర్ సింగ్ .. రణ‌బీర్ క‌పూర్ స‌హా ఎంద‌రో స్టార్లకు గొప్ప కెరీర్ ని అందించింది ఆయ‌నతో ఆరంభంలో చేసిన‌ సినిమాలే. ప‌ద్మావ‌త్ తో దీపిక ప‌దుకొనే లెవ‌లే మారిపోయింది. ఇప్పుడు ఆలియా భ‌ట్ ని అదే రేంజులో ఆవిష్క‌రిస్తూ గంగూభాయి క‌తియావాడీ లాంటి చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. వేశ్యాగృహ వాటిక నిర్వాహ‌కురాలు నాయ‌కురాలిగా మారి పురుషాధిక్య ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడించిన గంగూభాయిగా ఆలియా న‌టిస్తోంది. త‌న ఆహార్యం ఆద్యంతం ర‌క్తి క‌ట్టించ‌నుంద‌ని ఇంత‌కుముందు విడుద‌లైన టీజ‌ర్ వెల్ల‌డించింది.

తాజాగా తెలుగు ట్రైల‌ర్ ని ఒక సెక్ష‌న్ మీడియాకి భ‌న్సాలీ చూపించార‌ని తెలిసింది. ట్రైల‌ర్ ఆద్యంతం ఆలియా మెరుపులు ఆక‌ట్టుకోనున్నాయిట‌. ఈ సినిమాని హిందీతో పాటు తెలుగులోను భారీగా విడుద‌ల చేయ‌నున్నారు. ఆర్.ఆర్.ఆర్ తో పాటు ఆలియాకి ఇది పెద్ద ప్ల‌స్ కానుంది. ఇందులో అజ‌య్ దేవ‌గ‌న్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తారు.

ఇంత‌కుముందే.. ఇన్ స్టాగ్రామ్‌లో తన పాత్రను పరిచయం చేస్తూ అజయ్ ఇలా రాసాడు. ``అప్నీ పెహచాన్ సే చార్ చంద్ లగానే, .. ఆ రహే హై హమ్! (నేను నా వ్యక్తిత్వానికి ప్రత్యేక స్పర్శను జోడించడానికి వస్తున్నాను)`` అనేది అర్థం. అతను తెల్లటి చొక్కా - క్రీమ్ ప్యాంటు ధరించి గ్రే బ్లేజర్ నెహ్రూ క్యాప్ తో కనిపించాడు ఈ పోస్ట‌ర్ లో. అతను రద్దీగా ఉండే వీధి మధ్యలో కారు ముందు రకరకాలుగా జ‌నుల‌కు సలాం చేస్తూ కనిపిస్తున్నాడు. దేవ‌గ‌న్ లుక్ పై  స్పందిస్తూ.. రణవీర్ సింగ్  `పవర్` అని వ్యాఖ్యానించారు. ఈ సినిమా కోసం ఇప్పుడు నిజంగా ఉత్సాహంగా ఉన్నామంటూ అభిమానులు ఉత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నారు.
అజయ్ రెండు దశాబ్దాల తర్వాత గంగూబాయి కతియావాడి దర్శకుడు సంజయ్ లీలా భ‌న్సాలీతో కలిసి ప‌ని చేస్తున్నారు. వీరిద్దరూ చివరిసారిగా 1999లో హమ్ దిల్ దే చుకే సనమ్ కోసం కలిసి ప‌ని చేశారు.

అజయ్ గత ఏడాది ఫిబ్రవరిలో గంగూబాయి కతియావాడి షూటింగ్ ను ప్రారంభించాడు. భన్సాలీ నిర్మాణ బృందం గత సంవత్సరం సోషల్ మీడియాలో ఒక ఫోటోని షేర్ చేయ‌గా దేవగ‌న్ పాత్ర‌పై క్లారిటీ వ‌చ్చింది.  గంగూబాయి కతియావాడి క‌థాంశం ఆస‌క్తిక‌రం. 1960ల నాటి వ్యభిచార గృహ యజమాని పాత్రలో అలియా భట్ నటించింది. గంగూబాయి కామాటిపురను పాలిస్తూ రాజకీయ నాయ‌కురాలిగా మారుతుంది. ఆ త‌ర్వాత పురుషాధిక్య ప్ర‌పంచాన్ని ఎలా హ్యాండిల్ చేసింద‌న్న‌దే ఈ సినిమా క‌థాంశం. ఎస్ హుస్సేన్ జైదీ రచించిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

గంగూబాయి కతియావాడిలో విజయ్ రాజ్- ఇందిరా తివారీ - సీమా పహ్వా కూడా నటించారు. ఈ చిత్రాన్ని బన్సాలీ - జయంతిలాల్ గడా (పెన్ స్టూడియోస్) నిర్మించారు. ఇది 72వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రపంచ ప్రీమియర్ ను ప్రదర్శిస్తారు.  ఫిబ్రవరి 25న థియేటర్ లలో సినిమా విడుద‌ల‌వుతోంది. మ‌హాన‌టి త‌ర్వాత లేడీ బ‌యోపిక్ ఇదే కావ‌డంతో అంత‌టా ఎగ్జ‌యిట్ మెంట్ నెల‌కొంది.
Tags:    

Similar News