బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు షారుఖ్ పెంపకంను విమర్శిస్తుంటే మరి కొందరు మాత్రం షారుఖ్ ఖాన్ ను సమర్థిస్తూ ఈ సమయంలో ఆయనకు అండగా నిలుస్తున్నారు. ఆ మద్య వి సపోర్ట్ షారుఖ్ అనే హ్యాష్ ట్యాగ్ ఇండియా వైడ్ గా ట్రెండ్ అయిన విషయం తెల్సిందే. షారుఖ్ కు మద్దతు అన్నట్లుగా సల్మాన్ ఖాన్ స్వయంగా వెళ్లి మరీ పలకరించాడు. షారుఖ్ ఖాన్ ఇంటికి సల్మాన్ ఖాన్ వెళ్లడం పెద్ద చర్చకు తెర తీసింది. ఇక ఆర్యన్ కు విధించిన రిమాండ్ గడువు ముగియడంతో ఇక బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలు అయ్యాయి. ఈ సమయంలో ఆయన్ను చాలా మంది సమర్థిస్తూ వస్తున్నారు. బెయిల్ విచారణలో భాగంగా ఆర్యన్ కోర్టులో మాట్లాడుతూ తనకు డ్రగ్స్ కేసుతో సంబంధం లేదు.
అర్బాజ్ తన స్నేహితుడు అన్న మాట వాస్తవమే. కాని అతడు ఆ పార్టీ వద్దకు వస్తున్న విషయం తెలియదు. అతడిని అక్కడ చూసే వరకు అతడు వస్తున్న విషయం తెలియనప్పుడు నేను ఎలా డ్రగ్స్ తీసుకు రమ్మంటాను అన్నాడు. డ్రగ్స్ అతడి వద్ద ఉన్న విషయం కూడా ఎన్ సీ బీ అధికారులు వచ్చి చెక్ చేసే వరకు కూడా తెలియదు అంటూ ఈ సందర్బంగా ఆర్యన్ పేర్కొన్నాడు. తన చాటింగ్ లు మరియు ఫోన్ కాల్స్ ద్వారా ఎవరితో అయినా డ్రగ్స్ విషయమై చర్చ జరిపానో చూడవచ్చు అంటూ కోర్టులో ఆర్యన్ చెప్పాడు. ఆర్యన్ కోర్టు వాదనలు విన్న తర్వాత చాలా మంది ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా హృతిక్ రోషన్ కూడా మద్దతుగా నిలుస్తున్నట్లుగా ప్రకటించాడు.
ఆర్యన్ కు మానసిక ధైర్యం ను కలిగించేలా ఆయనకు ఈ సమయంలో తన మద్దతు తెలుపుతున్నట్లుగా హృతిక్ రోషన్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. తప్పకుండా ఈ సమయం నుండి అతడు బయట పడుతాడు. త్వరలోనే తిరిగి అతడు మామూలు స్థితికి రావాలని అంతా కోరుకుంటున్నట్లుగానే హృతిక్ కూడా ఆశించాడు. ఈ సమయంలో ఆర్యన్ కుటుంబ సభ్యులకు తన మద్దతు ఉంటుందని కూడా హృతిక్ తెలియజేశాడు. ఇక ఆర్యన్ తప్పు చేయలేదు అని నేను నమ్ముతున్నాను. తప్పకుండా అతడు నిర్దోశిగానే బయటకు వస్తాడు అంటూ హృతిక్ నమ్మకం వ్యక్తం చేశాడు. హృతిక్ రోషన్ పోస్ట్ పై చాలా మంది చాలా రకాలుగా స్పందించారు. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. హృతిక్ రోషన్ ఏం చేసినా కూడా ఆమె ముందుగా ట్రోల్ చేసేందుకు సిద్దంగా ఉంటారు. ఇన్ని రోజులు ఈ విషయమై స్పందించని కంగనా ఒక్కసారిగా స్పందించడం పట్ల తీవ్ర చర్చ జరుగుతోంది.
ఇలాంటి విషయాల్లో మీడియా తప్పుడు కథనాలు పెట్టడం మంచిది కాదు. కాని సమర్ధిస్తున్నట్లుగా మాట్లాడటం ఏమాత్రం మంచిది కాదు. వారిని ఇప్పుడు సమర్థిస్తే ఆ తప్పును సమర్థించినట్లే అన్నట్లుగా కంగనా చెప్పుకొచ్చింది. డ్రగ్స్ కేసులో ఆర్యన్ కు రక్షణగా మాఫియా పప్పులందరూ మూట కట్టుకుని వచ్చారు అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. తప్పు చేసిన వారిని తప్పు అని ఖండించకుండా సమర్థిస్తే అది ఖచ్చితంగా పెద్ద తప్పు అవుతుందని పరోక్షంగా హృతిక్ రోషన్ ను విమర్శించింది. తన పోస్ట్ లో హృతిక్ రోషన్ పేరును వినియోగించలేదు. కాని బాలీవుడ్ మీడియాతో పాటు ప్రతి ఒక్కరు కూడా అదే విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం కంగనా మరియు హృతిక్ ల పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి.