అనుకోని సమయంలో కలిసిన కాంబినేషన్ హిట్ కాంబినేషన్ గా మారితే మళ్లీ వాళ్లిద్దరిని కలిపి మరో క్రేజీ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుడుతుంటారు. అలాంటి క్రేజీ కాంబినేషనే మళ్లీ కలిసి పనిచేయబోతోంది. సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో అల్లరి నరేష్ కు 'నాంది' మూవీతో సూపర్ హిట్ లభించింది. ఈ మూవీని విజయ్ కనకమేడల అనే కొత్త దర్శకుడు తెరకెక్కించారు. చేయని తప్పుకి శిక్ష అనుభవించే ఓ అమాయకుడు తరిగబడితే ఎలా వుంటుందనే ఆసక్తికరమైన కథ, కథనాలతో ఈ మూవీని రూపొందించారు.
అల్లరి నరేష్ లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందించడమే కాకుండా హీరో నరేష్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో అల్లరి నరేష్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చేశాడు.
ప్రస్తుతం 'సభకు నమస్కారం', 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' అంటూ రెండు విభిన్నమైన చిత్రాల్లో నటిస్తున్నారు. హీరోగా మళ్లీ స్పీడు పెంచారు. ఇదిలా వుంటే మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కు నాంది పడింది. 'నాంది' సినిమాతో సూపర్ హిట్ కాంబినేషన్ అనిపించుకున్న అల్లరి నరేష్, విజయ్ కనకమేడల మరోసారి కలిసి సినిమా చేయబోతున్నారు.
ఈ మూవీని కృష్ణార్జున యుద్ధం, మజిలీ, గాలి సంపత్, టక్ జగదీష్ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా సోమవారం ప్రకటించింది. 'ఏ షాడో ఆఫ్ హోప్' పేరుతో ఓ కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేసింది. విజయ్ కనకమేడల, అల్లరి నరేష్ 2 అంటూ విడుదల చేసిన పోస్టర్ పై బేడీలు వేసిన చేతులు జత చేయగా షాడోలో 'డేగ' సింబల్ కనిపిస్తోంది.
బహుషా ఈ మూవీకి దీన్నే టైటిల్ గా ఖరారు చేయబోతున్నారని స్పష్టమవుతోంది. పవర్ ఫుల్ న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ వుండబోతోందని, నరేష్ కోసం విజయ్ కనకమేడల పవర్ ఫుల్ కథని అందించాడని మేకర్స్ చెబుతున్నారు. ఈ మూవీలో నరేష్ ఇంటెన్స్ రోల్ లో కనిపించబోతున్నాడని, క్రేజీ కాంబినేషన్ లో రూపొందనున్న ఈ మూవీ మరో బ్లాక్ బస్టర్ కి నాందిగా నిలవడం ఖాయమని చెబుతున్నారు.
ప్రస్తుతం నరేష్ నటిస్తున్న 'సభకు నమస్కారం', 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' చిత్రాల తరువాత ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ని పట్టాలెక్కిస్తారట. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలని మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.