నరేష్ చెప్పిన ఉదయ్ కిరణ్ ఆవేదన!

Update: 2016-10-23 10:31 GMT
చిత్రం సినిమాతో వెండితెరపై దర్శనమిచ్చాడు ఒక కుర్రవాడు. ఎటువంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకపోయినా స్వశక్తితో పైకి వచ్చాడు. యువహీరోల లిస్ట్ లో టాప్ ప్లేస్ లో నిలిచాడు... ఇంతలోనే ఏమైందో తెలియదు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. అతడే ఉదయ్ కిరణ్. ఈ పేరు వింటే చాలు తెలుగు ప్రేక్షకుల గుండెలు ఒక్కసారిగా బరువెక్కిపోతాయి. సిగ్గు పడుతూ చిరునవ్వులు చిందించే సొట్టబుగల చిన్నోడిని ఎవరు మాత్రం మరిచిపోగలరు. ఏమైందో ఏంఓ... కెరీర్ ఆరంభంలో అతని ఊపు చూసి ఎక్కడికో వెళ్లిపోతాడనుకున్న వారందరినీ షాకిస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అయితే చనిపోవడానికి కొన్నిరోజులముందు ఉదయ్ చాలా బాధనే అనుభవించిన సంగతి చాలామందికి తెలియదు. అయితే ఉదయ్ కిరణ్ ఎలా బాధపడేవాడో తనకు తెలుసునంటున్నాడు అతడి మిత్రుడైన అల్లరి నరేష్. తాజాగా ఒక ఇంటర్వులో ఉదయ్ గురించి ఒక బాధాకర విషయం చెప్పాడు నరేష్.

చనిపోక ముందు రోజు అల్లరినరేష్ ను ఉదయ్ కిరణ్ కలిశాడట. ఆ సమయంలో ఎందుకోగానీ ఉదయ్ ముఖంలో దిగులు, బాధ కనిపించాయట. దీంతో "ఏమైంది.. ఎందుకలా ఉన్నావ్" అని అడిగిన నరేష్ కు సమాధానం చెప్పిన ఉదయ్... పొద్దునే పేపర్లో వచ్చిన ఆర్టికల్ ను తనవద్ద ప్రస్థావించాడని చెబుతున్నాడు నరేష్. ఆ ఆర్టికల్ ని చదివిన ఉదయ్ అందులో ఒక యువ కథానాయకుడు కథలు సరిగా ఎంచుకోవట్లేదని రాసి ఉన్నట్లు చెప్పాడట. దీనిపై స్పందించిన నరేష్... "దానికెందుకు అంత బాధపడుతున్నావ్.. నీకు సంబంధించిన విషయం కాదు కదా" అని అనగా, అనంతరం షాకింగ్ విషయం చెప్పాడంట ఉదయ్ కిరణ్. "ఆ ఆర్టికల్ వేరే హీరోకు సంబంధించిందే అయినా... అతడు కథలు ఎంచుకోవడంలో మార్పు రాకపోతే అతడికి కూడా చివరికి ఉదయ్ కిరణ్‌ గతే పడుతుంది" అంటూ తనను ఉదాహరణగా చూపించారు అని బాధపడ్డాడట. దాంతో తన నోట మాట రాలేదని చెప్పాడు నరేష్.

ఒక నటుడు మంచి స్థాయిలో ఉన్నపుడు ఆకాశానికి ఎత్తేసిన వాళ్లే.. తర్వాత కింద పడితే ఎంత చిన్నచూపు చూస్తారో ఆ సంఘటనతో తెలుసుకున్నానని చెబుతూ, ఎంత పెద్ద నటులైనా అందరిలాగే భావోద్వేగాలు ఉంటాయని చాలామందికి తెలియదు అంటూ ఆవేదన చెందాడు అల్లరి నరేష్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News