ఏంజెలీనా రేంజ్ లోనే వెతుక్కున్నాడట

Update: 2016-11-23 22:30 GMT
బ్రాంజెలీనా అనీ హాలీవుడ్ ముద్దుగా పిలుచుకునే జంట బ్రాడ్ పిట్-ఏంజెలీనా జూలీ. వీరిద్దరూ ఇప్పటికే విడిపోవడానికి సిద్ధం కావడమే కాదు.. ఈ విడాకుల గొడవ పెద్ద ఇష్యూ కూడా అయిపోయింది. ఆరుగురు పిల్లలు గల ఈ జంట విడిపోవడం హాలీవుడ్ మొత్తానికి హాట్ టాపిక్.

ఈ వేడి ఇంకా చల్లారక ముందే బ్రాడ్ పిట్ కొత్త భామను వెతుక్కున్నాడని తెలుస్తోంది. అది కూడా.. ఏంజెలీనా రేంజ్ లోని హీరోయిన్ అంటున్నారు. బ్రాడ్ కుటుంబానికి బాడీగార్డ్ అయిన క్రిస్ హెర్జోగ్.. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్వూలో కొన్ని ఇంట్రెస్టింగ్ వివరాలు వెల్లడించాడు. 'బ్రాడ్ ఇప్పటికే మరో ఫేమస్ నటితో కనిపిస్తున్నాడు. ఆమె నాకు పర్సనల్ ఫ్రెండ్ కూడా. అంతే కాదు.. వారిద్దరు కలిసి ఒకే మంచాన్ని పంచుకుంటున్నారు కూడా. తను కూడా ఏంజెలీనా అంతటి పెద్ద నటే' అని చెప్పేశాడు క్రిస్.

అయితే.. ఇప్పుడే ఆ నటి పేరు తాను చెప్పలేనన్న ఇతను.. బ్రాడ్-ఏంజెలీనాల మధ్య వివాదం సమసిపోయే అవకాశం లేదని తేల్చేశాడు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు బ్రాడ్ ను తండ్రిగా పిలిచేందుకు కూడా ఇష్టపడకపోవడాన్ని అతను పాయింట్ చేసి చెప్పాడు. వీళ్లిద్దరి వివాదాన్ని అతి పెద్దగా మార్చిన ఘటన ఇదే అంటూ క్రిస్ చెప్పాడు. అయితే.. అంతా చెప్పి ఏంజెలీనా జోలీ రేంజ్ స్టార్ హీరోయిన్ పేరు మాత్రం చెప్పలేదు. మిగిలిన వివరాలు జనాల ఊహలకే వదిలేశాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News