'ఓటీటీ'.. నేడు డిజిటల్ వరల్డ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఇంటి నుండి బయటకి రాకుండా మనకు కుదిరిన సమయంలో నచ్చిన కంటెంట్ ని చూసుకోవడానికి అందరూ ఉపయోగిస్తున్న సాధనం డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ 'ఓటీటీ'. ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ హవా నడుస్తున్నది. అందరూ ఈ ఓటీటీలలో వచ్చే ఒరిజినల్ సినిమాలు వెబ్ సిరీస్ లు చూడటానికే ఆసక్తి చూపిస్తున్నారు. ఇదివరకు ఏ సినిమా ఎప్పుడు ఏ థియేటర్ లో రిలీజ్ అవుతుందని ఆలోచించేవారు ఆరాలు తీసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది కాబట్టి ఏ సినిమా ఎప్పుడు ఏ ఓటీటీలో విడుదలవుతుందో అని ఆరాలు తీస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన థియేటర్స్ క్లోజ్ అవడంతో జనాలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో విరగబడి వెబ్ కంటెంట్ చూసేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త సినిమాలను కూడా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మనకి డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, సన్ నెక్స్ట్, ఎమెక్స్ ప్లేయర్, జీ 5..ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే వీటన్నిటికీ బ్రేక్ చేస్తూ మొట్టమొదటి సారిగా మన తెలుగు నుంచే వచ్చిన 100 శాతం తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా”.
టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ నుంచి వచ్చిన ఈ యాప్ ప్రారంభంలో మంచి ఆదరణను రాబట్టుకుంది. కానీ రాను రాను మిగతా ఓటీటీలతో పోటీ పడలేకపోయిందనే కామెంట్స్ వినిపించాయి. అంతేకాకుండా 'ఆహా'లో వస్తున్న సినిమాలు వెబ్ సిరీస్ లు అంతలా ప్రభావాన్ని చూపలేకపోయాయని.. అందుకే మిగతా ఓటీటీలతో పోటీ పడలేకపోతోందని కామెంట్స్ వస్తున్నాయి. ఒకటి రెండు సినిమాలు తప్ప మిగతావన్నీ ఓల్డ్ మూవీస్ అవడం.. వెబ్ సిరీసెస్ కంటెంట్ కూడా నెట్ ప్లిక్స్ ప్రైమ్ రేంజ్ లో లేకపోవడమే దీనికి కారణమని అంటున్నారు. దీంతో తమ సినిమాలను ఓటీటీ రిలీజ్ చేయాలని అనుకుంటున్న నిర్మాతలు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ 'ఆహా' వైపు మాత్రం చూడటం లేదట. పక్కా తెలుగు ఓటీటీ అయిన 'ఆహా'కి తెలుగు కంటెంట్ అమ్మడానికి ముందుకు రాకపోవడం ఆశ్చర్యకరమే అని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. దీంతో 'ఆహా' టీమ్ వచ్చిన సినిమానే మహా భాగ్యం అనుకొని ఏ సినిమా వస్తే ఆ సినిమాని వెంటనే కొనేసుకుంటున్నారట. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'ఆహా' కి మళ్ళీ క్రేజ్ తీసుకురావడం కోసం యూత్ ఫుల్ సినిమాలను రిలీజ్ చేయాలని 'ఆహా' టీమ్ డిసైడ్ అయ్యారట.
ఈ క్రమంలో నవీన్ చంద్ర - సలోని లుథ్రా హీరో హీరోయిన్లుగా నటించిన 'భానుమతి రామకృష్ణ' సినిమాని 'ఆహా'లో జూలై 3న రిలీజ్ చేయబోతున్నారు. శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్ సమర్పణలో కృశివ్ ప్రొడక్షన్స్ మరియు హ్యాండ్ పిక్డ్ స్టోరీస్ బ్యానర్లపై యశ్వంత్ ములుకుట్ల నిర్మించారు. అచ్చు రాజమణి నేపథ్య సంగీతం అందించగా శ్రావణ్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు. రీసెంటుగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. సిటీలోని అమ్మాయి.. పల్లెటూరి నుండి సిటీకి వచ్చిన పెళ్లీడు దాటిపోయిన అబ్బాయి మధ్య ప్రేమ ఎలా పుట్టిందనే కథాంశంతో ఈ మూవీ రూపొందింది. మరి ఈ సినిమాతో 'ఆహా' పుంజుకొని మిగతా ఓటీటీలకు పోటీగా ఆహా అనిపించుకుంటుందేమో చూడాలి.