డిసెంబరు 2నే రావాల్సిన సినిమా ‘ధృవ’. ఇందుకోసం అంతా రెడీగా ఉన్నా.. సినిమాను రిలీజ్ చేయడానికి సందేహించాడు నిర్మాత అల్లు అరవింద్. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ నవంబరు 18నే రిలీజై మంచి కలెక్షన్లు సాధించి.. జనాలు థియేటర్లలోకి వచ్చే మూడ్లో లేరేమో అన్న సందేహాల్ని పటాపంచలు చేసింది. అయినప్పటికీ అరవింద్ సాహసం చేయలేదు. ఇందుకు ఆయన చేయించిన ఒక సర్వేనే కారణమట. ‘ధృవ’ను ఎప్పుడు రిలీజ్ చేయాలనే నిర్ణయం ఈ సర్వే ఫలితాలు చూశాకే ఆయన తీసుకున్నారట. ‘ధృవ’ ట్రైలర్ లాంచ్ సందర్భంగా అరవింద్ ఈ సంగతి వెల్లడించారు.
‘‘ధృవ సినిమాను డిసెంబరు 2కే రిలీజ్ చేసేద్దామనుకున్నాం. 500.. 1000 నోట్ల రద్దు నిర్ణయం తర్వాత కూడా ఈ రకంగా ఆలోచించాం. కానీ జనాలు థియేటర్లకు వస్తారా.. డబ్బులు బయటికి తీస్తారా.. వాళ్ల దగ్గర సినిమాకు ఖర్చు పెట్టడానికి సరిపడా డబ్బులుంటాయా అన్న సందేహాలు కలిగాయి. ఐతే దీని కోసం ఒక సర్వే చేయించాం. డిసెంబరు 9న నాటికైతే వాళ్ల దగ్గర రెండు జేబుల్లోనూ డబ్బులుంటాయని ఆ సర్వేలో తేలింది. అందుకే ఈ తేదీన సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించాం’’ అని నవ్వేశారు అరవింద్. నెల ఆరంభంలో జీతాలు పడ్డ వెంటనే అద్దె సహా రకరకాల బిల్లులు చెల్లించాల్సిన హడావుడిలో ఉంటారు జనాలు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇందుకోసం ఏటీఎంల దగ్గర భారీ క్యూలు ఉంటాయి. ఆ టైంలో వంద నోట్లను ఇంటి అవసరాల కోసం పొదుపుగానే వాడతారు. తర్వాతి వారానికి పరిస్థితి మెరుగుపడుతుందని.. అప్పటికి 500.. 2000 నోట్లు కూడా చాలినన్ని అందుబాటులోకి వస్తాయిని భావిస్తున్నారు. అరవింద్ సర్వేలోనూ ఈ విషయమే తేలినట్లుంది.