సావిత్రి గారి జీవిత కథ ఆధారంగా రూపొందిన మహానటి జైత్రయాత్ర దినదిన ప్రవర్ధమానంగా జరుగుతోంది. పైనుంచి ఆవిడ ఆశీర్వదించారేమో అన్నట్టుగా ఓవర్సీస్ లో సైతం ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. రెండో వారంలోకి అడుగు పెట్టాక థియేటర్లను పెంచాలని డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఒత్తిడి వస్తోంది అంటే పరిస్థితిని అంచనా వేయొచ్చు. ఈ నేపధ్యంలో అంతకు కేవలం 5 రోజుల ముందు విడుదలైన నా పేరు సూర్య హీరో బన్నీ తన తండ్రి అల్లు అరవింద్ తో కలిసి మహానటి టీంకి సక్సెస్ పార్టీ ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర నా పేరు సూర్య యుద్ధం చేస్తున్న సమయంలో మహానటి రావడం వల్ల దాని ప్రభావం ఎంత లేదన్నా వసూళ్ళపై పడటం స్పష్టంగా కనిపించింది. ఈ నేపధ్యంలో పార్టీ ఇవ్వడం గురించి బన్నీ -అరవింద్ ఇద్దరు అందులోనే క్లారిటీ ఇచ్చేసారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ లెక్కలు వేసుకోకుండా దత్తు గారి పిల్లలు ఈ సినిమా చేసినందువల్లే లెక్కలేనంత ప్రశంశలు - వసూళ్లు వస్తున్నాయని అభినందించాడు. నాగ అశ్విన్ కి ఫోన్ చేసి తమను గర్వపడేలా చేసినందుకు థాంక్స్ కూడా చెప్పానని ప్రస్తావించాడు.
ఇక అల్లు అరవింద్ సైతం మహానటి మీద ప్రశంశల వర్షం కురిపించాడు. తన స్నేహితుడు అశ్వినిదత్ పిల్లలు కష్టపడి ఈ సినిమా తీసినందుకు అభినందించాలని తనకు చెప్పింది బన్నీనే అంటూ అందరిని ఆశ్చర్యపరిచారు. మన సినిమా నా పేరు సూర్య మీద ఎఫెక్ట్ పడుతోంది కదా అని అల్లు అరవింద్ బన్నీని అడిగారట. దానికి సమాధానం చెబుతూ స్టార్ హీరోల సినిమాలు ఏడాదికి పది వస్తాయని కాని పదేళ్ళకోసారి వచ్చే మహానటి లాంటి సినిమాలను విష్ చేయకపోతే తప్పు అవుతుంది అని చెప్పబట్టే ఇది అరేంజ్ చేసానని చెప్పడం విశేషం. మొత్తానికి తమకు తీవ్రమైన పోటీ ఇస్తున్న సినిమా గురించి ప్రత్యేకంగా మీట్ పెట్టి మరీ సన్మానం చేయటం అంటే అల్లు ఫ్యామిలీ ఇక్కడే సినిమా ప్రేమికుల మనసులు గెలిచేసుకుంది. కేవలం ఐదు రోజుల గ్యాప్ తో వచ్చిన తమ పోటీ సినిమా టీంను ఇంత చక్కగా అప్రిషియేట్ చేయటం అంటే మాటలు కాదు. మహానటి రోజురోజుకి దూకుడు పెంచుకుంటూ పోతోంది. దానికి తోడు మే మూడో వారం నుంచి రావాల్సిన క్రేజీ మూవీస్ అన్ని వివిధ కారణాల వల్ల జూన్ కి వాయిదా పడటం బహుశా సినిమా కళామతల్లి ఆశీర్వాదమేమో అంటున్నారు టాలీవుడ్ అభిమానులు. లోతుగా ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది కదూ