పకడో పకడో అంటూ మళ్లీ వస్తున్నారు

Update: 2015-03-20 05:25 GMT
పకడో పకడో పకడో పకడో.. అంటూ అప్పట్లో బన్నీతో కలిసి సందడి చేశాడు దేవీశ్రీ. బన్నీ-దేవీ కలయిక అంటేనే పకడో పకడో. అందుకే ఆ ప్రమోషనల్‌ సాంగ్‌ పెద్ద రేంజులో హిట్టయ్యింది. బన్నీ కోసం దేవీ ఇచ్చిన ప్రతి పాటా సక్సెసే. ప్రతి ఆల్బం హిట్టే. ఆర్య, ఆర్య2, జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి ఇలా సినిమాల ఆడియో ఆల్బమ్స్‌ అన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయి. వీటన్నిటికీ మించి అప్పట్లో జులాయి సినిమాకి దేవీశ్రీ బన్నీతో కలిసి స్టెప్పులేసిన ఓ ప్రత్యేకగీతం చర్చల్లోకొచ్చింది. ఈ ప్రమోషనల్‌ సాంగ్‌లో డీఎస్‌పీ తనకంటూ ఓ మార్క్‌ ఉందని నిరూపించాడు. ఆటా పాటా ఉన్న గురువులాగా కనిపించాడు. ఇప్పుడు అదే మ్యాజిక్‌ని మరోసారి రిపీట్‌ చేయడానికి ఈ జోడీ ప్రయత్నిస్తున్నారని సమాచారం. పకడో పకడో అంటూ కంటిన్యూషన్‌ కాకపోయినా ఈసారి మరింత కొత్తగా ప్రయత్నించడానికి ఈ స్నేహితులిద్దరూ ప్రయత్నిస్తున్నారని సమాచారం. సన్నాఫ్‌ సత్యమూర్తి మానవ సంబంధాలు, కుటుంబ ఉద్వేగాలు, రొమాన్స్‌, సెంటిమెంట్‌, హాస్యం ఇలా నవరసాలు ఉన్న సినిమా. ఏప్రిల్‌లో రిలీజ్‌కి రాబోతోంది. అంతకంటే ముందే పకడో బ్యాచ్‌ ప్రమోషన్‌ మొదలవుతుందన్నమాట!!
Tags:    

Similar News