స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ -మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో మరో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ఓ వేదికపై నిర్మాత అల్లు అరవింద్ సైతం తమ బ్యానర్లో బోయపాటి సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కుమారుడితో చేస్తున్నాడా? లేక మరో హీరోతో అరవింద్ అలా ప్లాన్ చేసారా? అన్నది తెలియదు గానీ...తాజా సమచారాన్ని బట్టి బన్నిని దృష్టిలో పెట్టుకునే ఆ మాట అన్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి అందింది. బన్ని కోసం అదిరిపోయే ఓ మాస్ స్ర్కిప్ట్ ని సిద్దం చేసి పెట్టారుట బోయపాటి.
పక్కా కమర్శియల్ ఎంటర్ టైనింగ్ స్ర్కిప్ట్ అని సమాచారం. బన్ని ని మాస్ హీరోగా నెక్స్ట్ లెవల్లో చూపించడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి బోయపాటి మళ్లీ బన్నీ తో దాదాపు ఖరారు అయినట్లే తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కలయికలో తెరకెక్కిన `సరైనోడు` బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. భారీ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సినిమా బన్నీ కెరీర్ లోనే భారీ వసూళ్ల చిత్రంగా రికార్డు సృష్టించింది. గీతా ఆర్స్ట్ సాధించిన బ్లాక్ బస్టర్ వసూళ్లలో `మగధీర` తర్వాత `సరైనోడు` నిలిచింది. ఆ కాన్ఫిడెన్స్ తోనే అరవింద్ మరో ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటి అఖండ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని ఇదే ఏడాది రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
వాస్తవానికి ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ డిలే కారణంగా వాయిదా పడింది. అటు బన్ని సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం `పుష్ప`లో నటిస్తున్నాడు. చిత్రీకరణ క్లైమాక్స్ కి చేరుకుంది. ఈ సినిమా రిలీజ్ అయి హిట్ అయితే బన్నీ రేంజ్ పాన్ ఇండియాకి రీచ్ అవుతుంది. మరి అలా రీచ్ అయితే అలాంటి సమయంలో బన్ని బోయపాటి తో రీజనల్ సినిమా ఎంత వరకూ కరెక్ట్ ? అనే పునరాలోచనలో పడే అవకాశం లేకపోలేదు అనేటాక్ ఇన్ సైడ్ వినిపిస్తోంది. `అఖండ` భారీ విజయం సాధిస్తే గనుక ఆ ఆలోచనలో మార్పును కూడా ఆశించవచ్చిన అంటున్నారు.