అల్లు అర్జున్- స్నేహారెడ్డి ప్రేమ జంట గురించి తెలిసిందే. సినీపరిశ్రమకు ఎలాంటి సంబంధంలేని స్నేహా రెడ్డిని బన్ని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఇబ్రహీంపట్నంలో బీటెక్ చదివిన స్నేహారెడ్డి.. అమెరికాలో ఎమ్మెస్ పూర్తి చేశారు. వ్యాపారవేత్త.. విద్యాసంస్థల అధినేత కేపీఎస్ రెడ్డి కుమార్తె తను. కులాలకు అతీతంగా ఈ జోడీ పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకున్నారు. అయితే ఈ పెళ్లి కోసం ఎక్కువగా కష్టపడింది అల్లు అర్జున్ నే అని సన్నిహితులు చెబుతుంటారు. తొలుత అందరు పేరెంట్ లానే ఇంట్లో అయిష్టత వ్యక్తం అయినా ప్రేమించిన అమ్మాయినే దక్కించుకున్న అదృష్టవంతుడు బన్ని అన్న మాట వినిపిస్తుంటుంది.
ప్రేమాయణంలో కొన్ని ఎపిసోడ్ల అనంతరం.. 2011 మార్చి 6న హైదరాబాద్ హైటెక్స్‌లో బన్ని-స్నేహ జంట వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వారి ప్రేమకు ప్రతిరూపంగా 2014 ఏప్రిల్ 4న అయాన్ జన్మించాడు. 2016లో కూతురు అర్హ జన్మించింది. ప్రస్తుతం కిడ్స్ ఇద్దరూ పెరిగి పెద్ద వాళ్లయిపోతున్నారు. చూస్తుండగానే బాలనటులుగా నటించేంత వయసు వచ్చేస్తోంది. ఆ ఇద్దరితో తాత-నాయనమ్మలు సంబరంగా ఆడుకుంటున్న ఫోటోలు అంతర్జాలంలోకి వస్తున్నాయి. కూతురు అర్హ అయితే డాడీ బన్నీనే ఎదిరించేస్తోంది అప్పుడే. ఆ క్యూట్ లవ్ లీ ఫోటోల్ని బన్ని ఇప్పటికే అభిమానుల కోసం సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
తాజాగా అల్లు అర్జున్ తన భార్యామణి స్నేహతో కలిసి అన్యోన్యంగా ఉన్నప్పటి ఓ ఫోటో అంతర్జాలంలో వైరల్ అవుతోంది. పెళ్లికి ముందు ఇలానే ఎంతో సరదాగా గడిపిన రోజుల్ని గుర్తు చేసుకుంటున్నాడో ఏమో బన్ని. ఓపెన్ గా ఓ రెస్టారెంట్ లాంజ్ లో ఇలా అనురాగంతో ఆకట్టుకున్నారు. సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే బన్నీ.. కుటుంబంతో గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. భార్య స్నేహారెడ్డి.. కిడ్స్ అయాన్ - అర్హలతో కలిసి సరదాగా గడుపుతుంటారు. ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంట ఈ ఏడాది ఎనిమిదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా పెళ్లి ఫొటోను ట్వీట్ చేశారు అప్పట్లో.