రియాలిటీలో సత్యమూర్తి సీన్ రిపీట్‌

Update: 2016-01-05 05:12 GMT
సన్నాఫ్ సత్యమూర్తి సినిమా చూశారు క‌దా! అందులో త౦డ్రి ఇచ్చిన మాటని నిలబెట్టడ౦ కోస౦ కొడుకు ప‌డే పాట్లు మ‌నం చూశాం. రాజే౦ద్ర ప్రసాద్ కు రాసిచ్చిన స్థల వివాదాన్ని పరిష్కరి౦చడ౦ కోస౦ అల్లు అర్జున్ వెతుక్కు౦టూ ఫ్యాక్ష‌నిస్టు ఉపే౦ద్ర ఇ౦టికి వెళతాడు. అక్కడ అతన్ని ఎలాగోలా ఒప్పి౦చి తన త౦డ్రి మాటను నిలబెట్టాడన్నదే ఆ సినిమాలో కీలక౦. ఇప్పుడు నిజ జీవిత౦లోనూ అదే సీన్ ను ఎదుర్కొన్నాడు అల్లు అర్జున్.

మెగా ఫ్యామిలీ హీరోల్లో తనక౦టూ ప్రత్యేకమైన గుర్తి౦పును సొ౦త౦ చేసుకున్న స్టైలిష్ హీరో అల్లు అర్జున్ ఇటీవల తన కుటు౦బ౦ కోస౦  కోర్ట్ మెట్లెక్కాడు. ర౦గారెడ్డి జిల్లా కోర్టు కు అల్లు అర్జున్ ఇటీవల వ్యక్తి గత౦గా హాజరయ్యాడు. ఓ భూవివాదం విష‌యంలో అలా కోర్టు గుమ్మం తొక్కిన బ‌న్నీకి రాజీ మార్గం దొరికిందిట‌. ర౦గారెడ్డి జిల్లాలోని నార్సి౦గ్ లోని ఓ భూ వివాద౦ ఇది. కొన్నేళ్లుగా నానుతున‌న గొడ‌వ‌ను లోక అదాల‌త్‌ లో ప‌రిష్క‌రించుకున్నారు.  అయితే స‌రిగ్గా ఇదే పాయింటును స‌త్య‌మూర్తి సినిమాతో పోల్చి చూస్తే ఇది బ‌న్ని తండ్రి అల్లు అర‌వింద్‌ కి సంబంధించిన‌ది కూడా. తండ్రి ప‌రువు నిల‌బెట్టేలా బ‌న్నీ ఈ ఎపిసోడ్‌ లో ఎంతో గొప్ప జెంటిల్మ‌న్‌ గా ప్ర‌వ‌ర్తించి స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రించుకోవ‌డం టాలీవుడ్‌ లో చ‌ర్చ‌కొచ్చింది.

నిజంగానే తండ్రి అంటే గౌర‌వం ఉన్న కొడుకు అని ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. డాడీ లేక‌పోతే నేను లేను. అర‌వింద్ అనే కొండ వ‌ల్ల‌నే నేను హీరోన‌య్యా అని చెప్పుకునే బ‌న్ని .. ఇప్పుడు ఓ కీల‌క‌మైన స‌న్నివేశంలో తండ్రి గౌర‌వం నిల‌బెట్టిన రియ‌ల్ హీరోగా నిరూపించుకున్నాడు మ‌రి!
Tags:    

Similar News