స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంత సంతోషంగా ఉన్నాడనే దానికి మాటల్లో సమాధానం చెప్పడం కష్టం. సరైనోడు బ్లాక్ బస్టర్ తో ఇండస్ట్రీ టాప్ 5 హిట్స్ లోకి తన సినిమాని చేర్చిన బన్నీ.. ఆ జోష్ ని ఇప్పటికీ ఎం౦జాయ్ చేస్తున్నాడు. ఇదే సమయంలో అల్లు వారబ్బాయి తనకు సంతోషం కలిగించే మరో విషయాన్ని అభిమానులకు తెలిసేలా చేశాడా? అంటే.. అవుననే అంటున్నారు చూపరులు.
గత కొన్ని వారాలుగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గర్భవతి అనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అల్లు ఫ్యామిలీ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. పైగా మధ్యలో ఓసారి ఆమెను ఆస్పత్రిలో చేర్చారనే వార్తలతో అభిమానుల్లో గందరగోళం మొదలైంది. ఇప్పుడు వాటన్నిటికీ చెక్ పెడుతూ అసలు విషయాన్ని అఫీషియల్ గా అర్దమయ్యేలా చేశారు అల్లు అర్జున్ అండ్ వైఫ్ అని ఓ టాక్. తాజాగా హైద్రాబాద్ లో జరిగిన హరితహారం కార్యక్రమానికి బన్నీతో పాటు అతని భార్య స్నేహారెడ్డి కూడా హాజరైంది. ఆమె కడుపుతో ఉందనే విషయం ఇక్కడ కొన్ని ఫోటోల్లో స్పష్టంగా కనిపించింది. బన్నీ ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ చేయలేదు కాని.. చూస్తే మాత్రం మరోసారి ఇద్దరూ పేరెంట్స్ కాబోతున్నారని అనిపిస్తోంది.
2011లో అల్లు అర్జున్-స్నేహారెడ్డిల పెళ్లి జరగ్గా.. 2014లో వీళ్లిద్దరికీ తొలి సంతానంగా అల్లు అయాన్ పుట్టాడు. ఇప్పుడు 2016లో అల్లు అర్జున్ మరోసారి తండ్రి కాబోతున్నాడనమాట. గతంలో మాదిరి ఈ విషయాలన్ని అల్లు అరవింద్ అఫీషియల్ గా ప్రకటిస్తారేమో చూడాలి.