స్టైలిష్ స్టార్ బర్త్ డే సీడీపీ

Update: 2021-04-06 13:45 GMT
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు దగ్గరపడుతున్నా కొద్దీ అటు సినీపరిశ్రమలో ఇటు అల్లు అభిమానులలో సందడి అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే బన్నీ బర్త్ డే సెలెబ్రేషన్స్ ఏ రేంజిలో జరపాలని ఫ్యాన్స్ ఓ పక్కా.. పుష్ప బృందం మరో పక్కన ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నారో తెలియట్లేదు. కానీ ఈసారి అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకలు మాత్రం కరోనాను దృష్టిలో పెట్టుకొని జరపాల్సి ఉంటుంది. మరి ఎలా సెలెబ్రేట్ చేస్తారనేది చూడాలి. అయితే అల్లు అర్జున్ పుట్టినరోజుకు మరోరోజు సమయం ఉండగానే టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ బన్నీ బర్త్ డే సీడీపీని రిలీజ్ చేయడం విశేషం. ఈ ఏప్రిల్ 8తో బన్నీ తన 38యేటలో అడుగుపెట్టనున్నాడు.

తాజాగా సెలబ్రిటీలు అందరూ ఒక్కొక్కరుగా స్టైలిష్ స్టార్ సీడీపీ రిలీజ్ చేయడం అనేది ఫ్యాన్స్ కు చాలా థ్రిల్ కలిగిస్తుంది. ఎందుకంటే తమ అభిమానహీరో పుట్టినరోజు పోస్టర్ టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్స్ ఇలా ప్రతి ఒక్కరూ భాగమై ఈ బర్త్ డేను మరింత స్పెషల్ గా మార్చడంతో బన్నీ ఫ్యాన్స్ అంతా అంతులేని ఆనందంలో మునిగి తేలుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బన్నీ బర్త్ డే సీడీపీ ఓ రేంజిలో వైరల్ అవుతోంది. అలా రిలీజ్ చేసారో లేదో ఇలా లైక్స్ షేర్స్ అంటూ సీడీపీకి సోషల్ మీడియాలో బ్రహ్మరథం పడుతున్నారు. దాదాపు బన్నీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 18ఏళ్ల పైనే అయింది.

గంగోత్రి నుండి నేటి పుష్ప వరకు బన్నీ చేసిన అన్ని మంచి పనులను రిప్రెసెంట్ చేసేలా సీడీపీని డిజైన్ చేశారు. ఇందులో బన్నీ అందరితో 'గోగ్రీన్ విత్ అల్లుఅర్జున్' అనే ట్యాగ్ లైన్ తో పచ్చదనాన్ని పెంపొందించే విధంగా అందరికి మొక్కలను షేర్ చేసిన ఫోటోలతో సీడీపీ బాక్గ్రౌండ్ సెట్ చేశారు. అలాగే విద్య అందరికి అందాలనే ఉద్దేశంతో 'సర్వశిక్ష్యా అభియాన్.. అందరూ చదవాలి అందరూ ఎదగాలి' అనే బన్నీ హెల్పింగ్ నేచర్ రిప్రెసెంట్ చేసే ప్రయత్నం మనకు కనిపిస్తుంది. ఫైనల్లీ స్టైలిష్ స్టార్ అలవైకుంఠపురంలో.. సిత్తరాల సిరపడు లుక్ లో.. లేటెస్ట్ వైట్ టి-షర్ట్ లో స్మైలింగ్ పిక్ మెయిన్ అస్సెట్ గా అట్ట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం బన్నీ అభిమానులు సీడీపీ తో పండగ చేసుకుంటున్నారు. చూడాలి మరి వారి రియాక్షన్ ఎలా ఉండబోతుందో!
Tags:    

Similar News