బన్నీ ప్లానింగ్ భలేగుందమ్మా!!

Update: 2018-04-06 07:57 GMT
అల్లు అర్జున్ గతంలో మీడియా జనాలకు కాసింత దూరం పాటించేవాడు. అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తాడనే పేరుంది. కానీ ఈ మధ్య బన్నీలో బాగా మార్పు కనిపిస్తోంది. ఆమధ్యన ఓ నా పేరు సూర్య మేకర్స్ ఓ ప్రెస్ మీట్ నిర్వహిస్తుండా.. సడెన్ గా వచ్చేసి బోలెడన్ని కబుర్లు చెప్పడంతో పాటు.. మీడియా ఫ్రెండ్స్ అంటూ ఫోటోలు సెల్ఫీలు కూడా దిగి పంపాడు బన్నీ.

ఇప్పుడు అల్లు అర్జున్  బర్త్ డే వస్తోంది. ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే సందర్భంగా.. ముందు రోజు రాత్రి హైద్రాబాద్ జూబిలీ హిల్స్ లోని ఓ ఖరీదైన పబ్ లో మీడియా జనాలను పార్టీకి ఆహ్వానించాడు బన్నీ. నిజానికి ఏఫ్రిల్ 7వ తేదీ రాత్రి ఈ పార్టీ ప్లాన్ చేయగా.. అదే రోజున మహేష్ బాబు మూవీ భరత్ అనే నేను ఆడియో ఫంక్షన్ ను ప్లాన్ చేశారు. దీంతో తాను ఇచ్చే పార్టీని ఓ రోజు ముందుకు జరిపాడు బన్నీ. ఇలా మరో హీరో ఈవెంట్ కు అనుగుణంగా తాను ఇచ్చే పార్టీ ప్లానింగ్ ను బన్నీ మార్చుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది.

రీసెంట్ గా కూడా ఇలాగే బిహేవ్ చేశాడు అల్లు వారబ్బాయి. రంగస్థలం మూవీ రిలీజ్ కి వారం ముందు నుంచి తన సినిమాకి సంబంధించిన వార్తలు టెలికాస్ట్ చేయాల్సిన అవసరం లేదంటూ చెప్పడం చర్చనీయాంశం అయింది. ఇండస్ట్రీలో అందరితోనూ ఫ్రెండ్లీ బిహేవియర్ టైపుగా మారిపోతున్న బన్నీని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.


Tags:    

Similar News