అల్లు మ‌న‌వ‌రాలు క్యూట్

Update: 2018-11-22 06:52 GMT
ఫ్యామిలీ  మ్యాన్‌ గా అల్లు అర్జున్ లైఫ్ జోయ్‌ ఫుల్‌ గా లీడ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  స్టైలిష్ స్టార్ - స్నేహారెడ్డి జంట‌కు ముచ్చ‌ట‌గా ఇద్ద‌రు. పెద్ద‌వాడు మాష్ట‌ర్ అల్లు అయాన్.. ఆ త‌ర్వాత బేబి అల్లు అర్హ‌. ఈ ఇద్ద‌రిలో అయాన్ పెద్దోడైపోతున్నాడు. అర్హ‌ బుడి బుడి న‌డ‌క‌ల‌తో ఇంట్లో తిరిగిస్తూ బోలెడంత సంద‌డి చేస్తోంది. అయాన్ - అర్హ అన్నచెల్లెళ్లు ఇద్ద‌రికి బోలెడంత మంది క‌జిన్ ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉన్నారు. వీళ్లంతా క‌లిసి బోలెడన్ని ఆట‌లు ఆడుకుంటారు. అప్పుడ‌ప్పుడు వీళ్ల‌ను బ‌న్నీ ఆట‌విడుపు కోసం రెస్టారెంట్ల‌కు తీసుకెళుతుంటాడు. అక్క‌డ కూడా వీలుంటే ఆట‌లు ఆడుకుంటారు ఈ కిడ్స్ గ్యాంగ్. అవ‌న్నీ ఫోటోల రూపంలో ఇప్ప‌టికే సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్‌ చ‌ల్ చేస్తూనే ఉన్నాయి.

నిన్న‌టిరోజున అల్లు మ‌న‌వ‌రాలు అర్హ పుట్టిన‌రోజు వేడుక ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌లో అర్హ క్యూట్‌ గా ఎంత ముద్దొచ్చిందో. మామ్- డాడ్‌ ల‌తో క‌లిసి కేక్ క‌టింగ్ కార్యక్ర‌మంలో బోలెడంత హ‌డావుడి చేసింది. డాడ్‌ - మామ్‌ కి ఈ క్యూటీ కేక్ తినిపించి సంద‌డి చేసింది. ఆ ఫోటోలు ప్ర‌స్తుతం జోరుగానే వైర‌ల్ అవుతున్నాయి. అయాన్ - అర్హ‌ల సంద‌డితో తాత అల్లు అర‌వింద్ ఎంతో ముచ్చ‌ట‌ప‌డిపోతున్నార‌ట‌. ఇంత‌కీ క్యూట్.. చ‌బ్బీ అర్హ బ‌ర్త్‌ డే సెల‌బ్రేష‌న్స్ ఎక్క‌డ జరిగాయో తెలుసా?  బీచ్ సొగ‌సుల గోవాలో ఈ వేడుక జ‌రిగిందిట‌.

అంతా బాగానే ఉంది. కెరీర్ జోలికి వ‌స్తే.. నెక్ట్స్ స్టైలిష్‌ స్టార్ బ‌న్ని సినిమా ఎప్పుడో ఏంటో..!  త్రివిక్ర‌మ్‌ తో సినిమా అన్నారు. అదీ క‌థ ఓకే కాలేద‌న్నారు. ఇంకా ఇంకా గ్రౌండ్ వ‌ర్క్‌ లోనే ఉన్నార‌న్న మాటా వినిపిస్తోంది. మ‌రోవైపు విక్ర‌మ్‌.కె.కుమార్ స్క్రిప్టుని సాన‌బ‌డుతున్నాడ‌ని ప్ర‌చారం సాగింది. అస‌లు ఈ స్పెక్యులేష‌న్ అంత‌టికి బ‌న్ని ఎప్పుడు తెర దించుతాడో? ఎప్పుడు సినిమా ప్రారంభిస్తాడో?
Tags:    

Similar News