దాసరికి నా అవార్డు అంకితం

Update: 2017-06-19 04:22 GMT
ఆయన బ్రతికున్నప్పుడు ఎన్నెన్ని డిఫరెన్సులు అయినా ఉండొచ్చు కాని.. ఇప్పుడు ఆయన పరమపదించారు కాబట్టి.. ఖచ్చితంగా ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే అంటున్నారు మెగా హీరోలు. మొన్న కాదలి సినిమా ఆడియో లాంచ్ లో రామ్ చరణ్‌ అందరినీ రెండు నిమిషాలపాటు మౌనం పాటించమన్నాడు. దివంగత లెజండరీ డైరక్టర్ దాసరి నారాయణరావు గారి జ్ఞాపకార్దం అలా చేశాడు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే రూటును ఫాలో అయ్యాడు. ఏకంగా ఫిలింఫేర్ ఈవెంటునే మౌనంలో నిలబెట్టాడు.

గతేడాది విడుదలైన సరైనోడు చిత్రానికి.. బెస్ట్ యాక్టర్ కేటగిరీలో అల్లు అర్జున్ కి నామినేషన్ దక్కినా.. అవార్డ్ వరించలేదు. కాని ఫిలింఫేర్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ ను సరైనోడు చిత్రంలో నటనకు ఎంపిక చేశారు.  ఈ సందర్భంగా స్టేజ్ మీద మాట్లాడిన బన్నీ.. కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ''నన్ను వరించిన ఈ అవార్డును దాసరి నారాయణరావు గారికి అంకితమిస్తున్నాను. ఇక్కడ ఉన్న ఎంతోమందికి ఆయనే ప్రేరణ. ఈరోజు మనలో చాలామంది ఇక్కడ కూర్చున్నాం అంటే.. దానికి కూడా ఆయనే రీజన్. రెండు నిమిషాల పాటు అందరూ నుంచొని ఆయన కోసం మౌనం పాటించవల్సిందిగా కోరుతున్నాను'' అంటూ సెలవిచ్చాడు. దానితో ఫిలింఫేర్ అవార్డుల ప్రాంగణం దాసరి కోసం మౌనం పాటించింది. తన అవార్డును అంకితమిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా కూడా తెలియజేశాడు ఈ స్టయిలిష్ హీరో.

ఇక ఫిలింఫేర్ అవార్డుల విషయానికొస్తే.. ఈ అవార్డుతో బన్నీ హ్యాట్రిక్ కొట్టాడు. గతేడాది రుద్రమ దేవి చిత్రానికి గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్- మేల్ కేటగిరీలో అవార్డు సాధించాడు బన్నీ. అంతకు ముందు ఏడాది రేసుగుర్రం చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్ అవార్డ్ అల్లు అర్జున్ ఖాతాలో ఉంది. 2015 లో బెస్ట్ యాక్టర్.. 2016 లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్.. 2017లో క్రిటిక్స్ ఛాయిస్ బెస్ట్ యాక్టర్ అంటూ.. వరుసగా 3 ఏళ్ల పాటు ఫిలింఫేర్ అందుకుని హ్యాట్రిక్ కొట్టేశాడు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News