బన్నీ ఒక బ్రాహ్మిణ్‌.. నమ్మండి ప్లీజ్

Update: 2017-06-12 04:29 GMT
'అస్మైక యోగ.. తస్మైక భోగ.. రస్మైక రాగ హిందోళం' అంటూ సాగే లిరిక్స్.. డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమాకు బ్రాహ్మణులను అడ్డునిలిచేలా చేశాయి. ఆ పాటలోని మాటలు ఇబ్బందిగా ఉండటంతో.. ఆ కమ్యూనిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఆ పాటలోని లిరిక్స్ తొలిగించడమే కాకుండా.. ఇప్పుడు ఇటు హరీశ్‌ శంకర్.. అటు అల్లు అర్జున్ కూడా.. బ్రాహ్మణులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అల్లు అర్జున్ వాళ్లింట్లో ఓరోజు ఉదయాన్నే 10 మంది బ్రాహ్మణులు కనిపించారట. తనకు తెలియకుండా తన భార్య ఏదన్నా పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసిందేమో అనుకుంటే.. వాళ్ళందరినీ బన్నీ ఇంటికి పిలిపించి వేదాలను ఎలా పటించాలి.. వల్లించాలి అనే విషయం తెలుసుకుని తన ఉచ్ఛారణను మాటతీరును సాన బెట్టుకుంటున్నాడని తెలిసిందట. ఆ విధంగా బ్రాహ్మణుల తీరులో మాట్లాడటానికి చాలా శ్రమించి.. స్క్కీన్ పై స్వచ్ఛమైన బ్రాహ్మణిజం పండించాడట. ఇక హరీశ్ శంకర్ మాటలను బట్టి చూస్తే.. అల్లు అర్జున్ సదరు బ్రహ్మణికాన్ని పండించడానికి.. ఆ పాత్రను షూటింగ్ చేస్తున్న రోజులపాటు ఏకంగా నాన్ వెజ్ మానేశాడట. అదంతా బ్రాహ్మణులు అందరూ గర్వించాల్సిన విషయం అంటున్నాడు.

ఈ మాటలన్నీ చూసుకుంటే.. బన్నీ ఒక బ్రాహ్మిణ్‌.. నమ్మండి ప్లీజ్.. అని చెబుతున్నట్లు ఉంది. బాగానే ఉంది కాని.. అసలు సినిమా చూస్తే కాని బన్నీ ఎంత అద్భుతంగా ఒక శాస్ర్తిగారి పాత్రలో విజృంభించాడు అనే విషయంపై స్పష్టత రాదు. ఆ తరువాత మనోడ్ని బ్రాహ్మిణ్‌ కమ్యూనిటీ ఎంతవరకు నమ్ముతుంది అనే విషయం అర్ధమవుతుంది. ఏదేమైనా కూడా బన్నీ డెడికేషన్ అభినందనీయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News