ఆ బిజినెస్ పై కన్నేసిన అల్లు అర్జున్?

Update: 2018-12-05 07:27 GMT
ఈమధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు మల్టిప్లెక్స్ చైన్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.  ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ తో కలిసి ఎఎంబీ సినిమాస్ బ్రాండ్ తో హైదరాబాద్ లో తమ మొదటి మల్టిప్లెక్స్ నెలకొల్పాడు.  రీసెంట్ గానే ఈ మల్టిప్లెక్స్ ప్రారంభోత్సవం జరుపుకుంది.  ఇదిలా ఉంటే ఇతర టాలీవుడ్ స్టార్స్ కూడా మల్టిప్లెక్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారట.

తాజా సమాచారం ప్రకారం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మల్టి ప్లెక్స్ నెలకొల్పేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట.  అమీర్ పేట్ లోని సత్యం థియేటర్ ను కొద్ది నెలల క్రితమే కూల్చేశారు. ఇప్పుడు అదే స్థలంలో సునీల్ నారంగ్ తో కలిసి మల్టిప్లెక్స్ ప్లాన్ చేస్తున్నాడట అల్లు అర్జున్.  థియేటర్ బిజినెస్ అల్లువారి ఫ్యామిలీకి కొత్తేం కాదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో పలు సింగిల్ స్క్రీన్స్ థియేటర్లు అల్లు అరవింద్ కంట్రోల్ లోనే ఉన్నాయి.  కానీ అల్లు అర్జున్ మల్టి ప్లెక్స్ ఆలోచన మాత్రం కొత్తదే.

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉండే ఈ లొకేషన్ లో మల్టిప్లెక్స్ ప్లాన్ చేయడం బిజినెస్ పరంగా మంచి ఐడియానే.  మరి ఈ ఆలోచనను అల్లు అర్జున్ ఎలా ముందుకు తీసుకెళ్తాడో వేచి చూడాలి. అల్లు అర్జున్ ఇప్పటికే ఇతర బిజినెస్ లపై కూడా ఫోకస్ చేస్తున్నాడు. బీ-డబ్స్ పేరుతో ఒక రెస్టారెంట్ ఉంది.  గీతా ఆర్ట్స్ కాకుండా సొంత బ్యానర్లో సినిమాలు కూడా నిర్మించే ఆలోచనలో కూడా ఉన్నాడు.  మల్టిప్లెక్స్ బిజినెస్ కూడా ఇప్పుడు బన్నీ లిస్టు లోకి వచ్చినట్టే.  
Tags:    

Similar News