నాన్న సూచనతో తమ్ముడి సక్సెస్‌ వేడుకకి అల్లు అన్నయ్య

Update: 2022-11-06 06:39 GMT
హలో శిరీష్‌ హీరో గా రూపొందిన ఊర్వశివో రాక్షసివో సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగాయి. సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగా హీరోస్ కాకుండా నందమూరి హీరో బాలకృష్ణ హాజరు కావడం అందరి దృష్టిని ఆకర్షించింది.

సరే అల్లు అర్జున్ ఆ తర్వాత ఆయన ఏదో ఒక సందర్భంలో తమ్ముడు శిరీష్ సినిమా గురించి స్పందిస్తారని అంతా అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ ఇప్పటి వరకు ఊర్వశివో రాక్షసివో సినిమా గురించి అస్సలు స్పందించ లేదు.

దాంతో అన్నదమ్ముల మధ్య గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్నట్లు విభేదాలు ఉన్నాయని, వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలకు ఇదే ప్రత్యక్ష సాక్షం అంటూ కొందరు చర్చించుకోవడం మొదలు పెట్టారు.

ఈ విషయమే తాజాగా అల్లు శిరీష్ ని ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ.. సోషల్ మీడియా ద్వారా సినిమా గురించి ట్వీట్ చేస్తేనే ఇద్దరి మధ్య అనుబంధం ఉన్నట్లా.. లేదంటే లేనట్లేనా అంటూ రివర్స్ కౌంటర్ వేశాడు.

ఈ సమయంలోనే సినిమా యొక్క సక్సెస్ మీట్ కి అల్లు అర్జున్ హాజరు కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. కేవలం అల్లు అరవింద్ సూచన మేరకు తమ్ముడితో ఉన్న విభేదాల పుకార్లను  కొట్టిపారేసేందుకు ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరయ్యేందుకు ఓకే చెప్పాడు అంటూ ప్రచారం జరుగుతోంది.

ఇంతకు అల్లు బ్రదర్స్ మధ్య సఖ్యత ఉందా లేదా అనేది మాత్రం స్పష్టత రావడం లేదంటూ కొందరు మెగా ఫాన్స్ జుట్టు పీక్కుంటున్నారు. అసలు మెగా ఫ్యామిలీ హీరోలు కలిసి ఉన్నారా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కొందరు మాత్రం అల్లు హీరోలు మాత్రమే కాకుండా మెగా హీరోలు అంతా కూడా ఒక్కటే అని.. వారి మధ్య గొడవలు కేవలం మీడియా సృష్టి అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఊర్వశివో రాక్షసివో సినిమా సక్సెస్ మీట్ సందర్భం గా అల్లు అర్జున్ ఎలా మాట్లాడుతాడు? విభేదాల గురించి ఏం కామెంట్స్ చేస్తాడు అనేది చూడాలి.
Tags:    

Similar News