అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 1 తర్వాత చేయబోతున్న సినిమా ఐకాన్ అనే విషయం తెల్సిందే. ఈ సినిమా గురించి దాదాపుగా మూడు సంవత్సరాలుగా చర్చ జరుగుతోంది. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందబోతుంది. వకీల్ సాబ్ వంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమా రూపొందబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అంచనాలు పీక్స్ లో ఉంటాయి. అంతే కాకుండా అల్లు అర్జున్ ప్రస్తుత స్టార్ డమ్ నేపథ్యంలో భారీ ఎత్తున ఈ సినిమా ను నిర్మించాలని దిల్ రాజు భావిస్తున్నాడట. ఐకాన్ ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలోనే ఐకాన్ కోసం స్క్రిప్ట్ ను రెడీ చేసిన విషయం తెల్సిందే. అయితే ఇప్పుడు బన్నీ రేంజ్ పాన్ ఇండియా కనుక ఆ దిశగా మార్పులను సూచించారని సమాచారం అందుతోంది.
బన్నీ సన్నిహితులు ఇంకా బన్నీకి నమ్మకస్తులు అయిన కొందరు రచయితలు ఐకాన్ స్క్రిప్ట్ కు వేణు శ్రీరామ్ తో కలిసి పాన్ ఇండియా టచ్ ఇవ్వడం జరుగుతుందని కామెంట్స్ వస్తున్నాయి. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఐకాన్ సినిమా టైటిల్ పాన్ ఇండియా అప్పీల్ ను ఇప్పటికే దక్కించుకుంది. కనుక స్క్రిప్ట్ విషయంలో కూడా పాన్ ఇండియా రేంజ్ ను మెయింటెన్ చేయాలని బన్నీ భావిస్తున్నాడని.. అందుకే ఆయన టీమ్ ను రంగంలోకి దించి చిన్న చిన్న మార్పులతో ఐకాన్ ను రెడీ చేయించడం జరుగుతుందని తెలుస్తోంది. వేణు శ్రీరామ్ రెడీ చేసిన స్క్రిప్ట్ విషయంలో బన్నీ నమ్మకంతోనే ఉన్నాడు కాని పాన్ ఇండియా మార్కెట్ కోసం మార్పులు తప్పడం లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ అక్టోబర్ లో మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. సినిమాను కేవలం నాలుగు నెలల్లో ముగించేలా ప్లాన్ చేయాల్సిందిగా వేణు శ్రీరామ్ కు బన్నీ కండీషన్ పెట్టాడు అనేది కూడా టాక్ వినిపిస్తుంది.
పుష్ప పార్ట్ 1 కు పార్ట్ 2 కు మద్య ఆరు నెలల గ్యాప్ ను దర్శకుడు సుకుమార్ తీసుకుంటాడు అనే వార్తలు వస్తున్నాయి. అందుకే మద్యలో ఐకాన్ సినిమాను చేయాలనే ఉద్దేశ్యంతో బన్నీ చాలా స్పీడ్ గా ఆ పనులు చేయిస్తున్నాడు అనే టాక్ వినిపిస్తుంది. ఐకాన్ సినిమా తో బన్నీ ఉత్తరాది ప్రేక్షకులకు మరింతగా చేరువ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పుష్ప సినిమా కోసం బన్నీ కొత్త గెటప్ లో కనిపించబోతుంది. మరి ఐకాన్ లో ఎలాంటి గెటప్ ను బన్నీ ప్రేక్షకులకు చూపించబోతున్నాడు అనేది కొద్ది రోజులుగా వినిపిస్తున్న ప్రశ్న. ఐకాన్ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే సినిమాలో మరో హీరోయిన్ గా కృతి శెట్టి కూడా నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అసలు విషయం చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇస్తే కాని తెలియదు.