మాస్ థియేటర్ లో దొంగచాటుగా బన్నీ!

Update: 2022-06-04 04:50 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రహస్యంగా ఒక సినిమా చూసినట్లుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో స్టార్స్ ఎవరైనా సరే ఒక సినిమా నచ్చితే సాధారణ థియేటర్ లో జనాలతో పాటు చూడాలి అని ప్రత్యేకంగా మాస్క్ వేసుకుని మరీ వెళ్తున్నారు. గతంలో అయితే స్టార్స్ ప్రత్యేకంగా ఇంట్లోనే క్యూబ్ ద్వారా స్పెషల్ గా సినిమాలను వీక్షించే వారు.

బయటకు వెళితే ఫ్యాన్స్ తో కలిసి చూడాలని వారికి కూడా ఉంటుంది. కానీ పరిస్థితులు ఏమాత్రం అనుకూలించవు కాబట్టే ఆ విధంగా ప్రయోగాలు చేయడానికి చాలావరకు వెనుకడుగు వేస్తూ ఉంటారు.

అయితే ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా మాస్క్ వేసుకొని ఎవరికీ తెలియకుండా మారువేషంలో కూడా సినిమాలు చూడవచ్చు అనే ఐడియా ఫాలో అవుతున్నారు. ఆ మధ్య కాలంలో సాయి పల్లవి కూడా ప్రత్యేకంగా బుర్కా వేసుకుని శ్యామ్ సింగరాయ్ సినిమాను వీక్షించింది. ఇక అల్లు అర్జున్ కూడా రీసెంట్ గా F3 సినిమా చూసినట్లుగా ఆయన తండ్రి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు.

అయితే సాధారణంగా అల్లు అర్జున్ తన ఇంట్లో ఉన్న క్యూబ్ థియేటర్లోనే ప్రత్యేకంగా సినిమాలను వీక్షిస్తూ ఉంటాడు. కొత్త సినిమా ఏది రిలీజ్ అయినా కూడా హోమ్ థియేటర్ లో నే తన ఫ్యామిలీతో కలిసి చూస్తూ ఉంటాడు.

అయితే ఇటీవల ఫారిన్ ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన బన్నీ మొదట మూడు సినిమాలు కూడా అలానే చూడాలని అనుకున్నాడట. అయితే అల్లు అరవింద్ మాత్రం అందుకు ఒప్పుకోకుండా ఇలాంటి సినిమాను ఒక నార్మల్ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి చూస్తేనే బాగుంటుంది అని చెప్పారట.

కామెడీ ఎంటర్టైనర్ కాబట్టి థియేటర్ లో ఉండే వాతావరణం విభిన్నంగా ఉంటుంది అని వివరణ ఇవ్వడంతో అల్లు అర్జున్ కూడా దొంగచాటుగా ఎవరికీ డౌట్ రాకుండా కూకట్ పల్లిలోని మాస్ థియేటర్లో సినిమా చూసినట్లు అల్లు అరవింద్ తెలియజేశారు. ఎవరికి ఏ మాత్రం అనుమానం రాకుండా ఇంటర్వెల్ తర్వాత మళ్లీ బయటకు వచ్చే లైట్స్ ఆఫ్ కాగానె మళ్ళీ థియేటర్లోకి  వెళ్లిన బన్నీ సినిమా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News