ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం `పుప్ప : ది రైజ్`. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు ఏ మాత్రం తగ్గని స్థాయిలో ఈ చిత్ర రిలీజ్ ని భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రిలీజ్ కోసం ఇప్పటికే ప్రమోషన్స్‌ని స్పీడప్ చేసిన మేకర్స్ త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా బన్నీ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ లో ప్రసారం అవుతున్న డ్యాన్సింగ్ రియాలిటీ షో `ఢీ 13` కింగ్స్ వర్సెస్ క్వీన్ లాస్ట్ ఎపిసోడ్‌కి గెస్ట్‌గా వెళ్లారు.
ఈ సందర్భంగా అక్కడ డ్యాన్స్ చేసిన వారిని, వారి డ్యాన్స్ ని సునిశితంగా పరిశీలించారు. అంతే కాకుండా తనని తాను ప్రశ్నించుకున్నారట. అంతే కాకుండా డ్యాన్స్ విషయంలో తాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకున్నారట. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బన్నీ మాటల్లో ఇదే విషయం స్పష్టమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన అల్లు అర్జున్ పలు ఆసక్తికర విషయాల్నివెల్లడించారు. డ్యాన్స్ విషయంలో రానున్న రోజుల్లో తాను ఎలా కష్టపడాలనుకుంటున్నాడో స్పష్టం చేశారాయన.
`ఈ రోజు ఈ షోకి వచ్చి ఈ డ్యాన్సులను ప్రత్యక్ష్యంగా చూసిన తరువాత డ్యాన్స్ , కొరియోగ్రఫీ పరంగా నేటి తరం యువకులు నా కంటే అడ్వాన్స్‌గా వున్నారనే భావన కలిగింది. నేను ఇప్పుడు కష్టపడి పని చేయాల్సిన అవసరం వుంది. కెరీర్ పరంగా నేను మరింత ముందుకు వెళ్లడానికి ఖచ్చితంగా డ్యాన్స్ ని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలి. రాబోయే పదేళ్లలో నేను మరింత మెరుగ్గా డ్యాన్స్ చేయగలనని నిరూపించాలనుకుంటున్నాను. అంతే కాకుండా వయసు కూడా పెరుగుతోంది. ఈ రోజు నన్ను ప్రోత్సహించినందుకు ఈ షోలోని కొరియోగ్రాఫర్లు.. కంటెస్టెంట్ లందరికి నా కృతజ్ఞతలు` అని అల్లు అర్జున్ తెలిపారు. బన్నీకి డ్యాన్స్ అంటే ప్రాణం అన్న విషయం తెలిసిందే.