తమిళ హీరోలకు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కమల్, రజనీ, విక్రమ్, అజిత్ తదితర హీరోలకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. వారి సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని ఎదురు చూసే అభిమానులున్నారు. వారందరికీ, తరచుగా ఎదురయ్యే ప్రశ్న ఒక్కటే! తెలుగులో డైరెక్ట్ మూవీ ఎప్పుడు అని. అప్పుడు చేస్తాం...ఇప్పుడు చేస్తాం... మంచి కథ కోసం చూస్తున్నాం... అంటూ వారందరూ సమాధానాన్ని దాటేస్తుంటారు..
తెలుగు హీరోలకు కూడా తమిళ, మలయాళ ఇండస్ట్రీలో ఫ్యాన్స్ ఉన్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు కేరళలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడ బన్నీ సినిమాలు స్ట్రెయిట్ సినిమాలలానే విడుదలవుతుంటాయి. అక్కడి అభిమానుల కోసం మళయాళంలో స్ట్రెయిట్ మూవీ చేయబోతున్నట్లు కూడా చెప్పాడు బన్నీ.
‘డీజే’ ప్రమోషన్లలో భాగంగా యూట్యూబ్ లైవ్ ఇంటర్వ్యూలో బన్నీ తన మనసులో మాట బయటపెట్టాడు. తాను మొక్కుబడిగా మాట్లాడట్లేదని, అభిమానుల కోసం స్ట్రెయిట్ మూవీ చేయాలని గట్టిగానే అనుకుంటున్నానని తెలిపాడు. ఆల్రెడీ కొన్ని కథలపై చర్చలు కూడా జరిగాయని చెప్పడం విశేషం.
ఈ సందర్భంఆ మళయాల ఇండస్ట్రీని బన్నీ పొగడ్తలతో ముంచెత్తాడు. మళయాళం ఇండస్ట్రీ చాలా గ్రేట్ అని, అక్కడ మంచి అభిరుచి ఉన్న దర్శకులున్నారని కితాబిచ్చాడు. అలాంటి ఇండస్ట్రీలో పని చేయాలని ఎవ్వరైనా అనుకుంటారని బన్నీ తెలిపాడు. అల్లు అర్జున్ గత సినిమాల మాదిరే.. ‘డీజే’ను కూడా మలయాళంలో కొంచెం లేటుగా రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/