గత ఏడాదిలో విడుదల అయిన టాలీవుడ్ చిత్రాల్లో బిగ్గెస్ట్ చిత్రం ఏది అంటే మరో మాట లేకుండా అల వైకుంఠపురంలో అనడంలో సందేహం లేదు. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా నాన్ బాహుబలి రికార్డును దక్కించుకుంది. ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్న అల వైకుంఠ పురంలో సినిమా ను హిందీలో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత ఏడాది లోనే సినిమా చిత్రీకరణ మొదలు అవ్వాల్సి ఉంది. కాని కరోనా కారణంగా రీమేక్ ను ఈ ఏడాది పట్టాలు ఎక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ సినిమా రీమేక్ రైట్స్ ను హిందీ మేకర్స్ దాదాపుగా పది కోట్లకు గాను కొనుగోలు చేశారు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇండస్ట్రీ హిట్ మూవీ కనుక ఆ రేటు పెట్టడం సబబే అని కూడా కొందరు అంటున్నారు. ఇక అల్లు అర్జున్ పోషించిన పాత్రకు గాను పలువురు యంగ్ హీరోలను పరిశీలించిన తర్వాత కార్తీక్ ఆర్యన్ ను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. ఇక హీరోయిన్ గా ఒరిజినల్ వర్షన్ లో పూజా హెగ్డే నటించగా హిందీలో కృతి సనన్ ను నటింపజేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
హిందీ లో రూపొందబోతున్న అల వైకుంఠపురంలో సినిమా రీమేక్ లో పరేష్ రావల్ మరియు మనీష కోయిరాలు నటించబోతున్నారు. తెలుగు వర్షన్ లో టబు పోషించిన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే హిందీ వర్షన్ లో ఆ పాత్రను మనీషా కోయిరాల చేసేందుకు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్న ఈ సమయంలో బాలీవుడ్ మీడియా వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం అందుతోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ ను మేకర్స్ సంప్రదించారనే వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్ మీడియా కథనాల అనుసారంగా అల వైకుంఠపురంలో సినిమా హిందీ రీమేక్ లో కూడా బన్నీ ని నటించాల్సిందిగా మేకర్స్ కోరారట. హీరో పాత్రకు కాకుండా అయిదు నుండి పది నిమిషాల స్క్రీన్ ప్రజెన్స్ ఉండే ఒక గెస్ట్ రోల్ కోసం బన్నీని సంప్రదించారట. తన సినిమా రీమేక్ లో తానే గెస్ట్ రోల్ లో నటించే అవకాశం అంటే చాలా అరుదైన విషయం. అందుకే బన్నీ ఈ ఆఫర్ ను కాదనకప పోవచ్చు అంటున్నారు. బన్నీకి ప్రస్తుతం బాలీవుడ్ లో ఆఫర్లు కావాలి. కనుక ఈ ఆఫర్ ను బాలీవుడ్ ప్రేక్షకులకు మరింతగా చేరువ అయ్యేందుకు అవకాశంగా బన్నీ భావిస్తున్నాడట.
మరో వైపు బన్నీ సినిమాల విషయానికి వస్తే పుష్ప సినిమా ను ఆయన చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. పెద్ద ఎత్తున అంచనాలున్న పుష్ప సినిమా ను రెండు పార్ట్ లుగా చేస్తున్నారు. మొదటి పార్ట్ పూర్తి అయిన తర్వాత ఐకాన్ సినిమాను ఆరు నెలల్లో పూర్తి చేసి మళ్లీ పుష్ప 2 ను చేయబోతున్నాడట. పుష్ప సినిమా చిత్రీకరణ పూర్తి అయిన తర్వాత అల వైకుంఠపురంలో హిందీ వర్షన్ లో బన్నీ నటించే అవకాశాలు ఉన్నాయని కొందరు అంటున్నారు.
అల్లు అర్జున్ ప్రస్తుతం తెలుగు లో నటిస్తున్న ప్రతి సినిమా ను కూడా బాలీవుడ్ లో విడుదల చేసేలా పాన్ ఇండియా సబ్జెక్ట్ ను యూనివర్షల్ సబ్జెక్ట్ ను ఎంపిక చేసుకుంటున్నాడు. పుష్ప సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా ఇటీవల ఒక సర్వేలో బాలీవుడ్ ప్రేక్షకులు చెప్పుకొచ్చారు. కనుక బాలీవుడ్ ఆయనకు ఉన్న క్రేజ్ ను అల వైకుంఠ పురంలో సినిమా రీమేక్ కోసం వినియోగించుకోవాలనే నిర్ణయానికి వచ్చారట.