అల్లు అర్జున్ ఖాతాలో కొత్త రికార్డ్

Update: 2018-03-03 06:48 GMT
అల్లు అర్జున్ ని ఇప్పుడు అందరూ కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అంటున్నారు. అదేంటి బన్నీ మనకు స్టయిలిష్ స్టార్ గా మాత్రమే తెలుసు మరి సోషల్ మీడియా కి కింగ్ ఎప్పుడయ్యాడు అనుకుంటున్నారా? ఈమధ్యనే అండీ. ఇప్పుడు ఫాన్స్ అంతా ఈ అల్లు వారబ్బాయి ని ఇలానే పిలుస్తున్నారు. కారణం అతను చేస్తున్న పోస్టులు క్రీయేట్ చేస్తున్న రికార్డులే.

సోషల్ మీడియా లో బాగా యాక్టీవ్ గా ఉండే బన్నీ తన సినిమాల గురించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఫాన్స్ కి అందిస్తూ ఉంటాడు. బన్నీ రాబోయే సినిమా 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' అని అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమా తాలూకు పోస్టర్ ఇంపాక్ట్ ని ఈమధ్యనే రిలీజ్  చేయగా అది సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కేవలం ట్విటర్లోనే 710 వేల ట్వీట్లు వచ్చాయి. అది కూడా కేవలం 24 గంటలలో అంటే మీరు నమ్మగలరా? కానీ అది నిజం. అందుకే ఇప్పుడు బన్నీ ని అందరూ సోషల్ మీడియా కి కింగ్ అని పిలుస్తున్నారు.

నోట్లో సిగరెట్ - ఎడమ కనుబొమ్మ పైన ఘాటు - డిఫరెంట్ హెయిర్ స్టైల్ - స్టైలిష్ గాగుల్స్ లో బన్నీ అదరగొట్టేసాడు. ప్రతి చిన్న అప్డేట్ తోనూ అల్లు అర్జున్ తన సినిమా పై అంచనాలను అలా ఆకాశానికి ఎత్తేస్తున్నాడు అనటంలో అబద్దం లేదు. కెరీర్ లో మొదటిసారి బన్నీ ఒక సైనికుడిలా కనిపించబోతుండగా ఫ్యాన్స్ అంతా సినిమా విడుదలకై కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు.
Tags:    

Similar News