తెలుగు స్టార్ హీరోల్లో అత్యధిక కమర్షియల్ యాడ్స్ లో నటించింది ఎవరు.. ఇప్పుడు నటిస్తున్నది ఎవరు.. ఎక్కువ కంపెనీలతో ఒప్పందాలను కలిగి ఉన్నది ఎవరు అంటే ఏమాత్రం అనుమానం లేకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు అనే సమాధానం వస్తుంది. టీవీలో మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఏదో ఒక కంపెనీకి సంబంధించిన యాడ్ వస్తూనే ఉంటుంది.. అందులో మహేష్ కనిపిస్తూ ఉంటాడు.
అతి త్వరలోనే పుష్ప స్టార్ అల్లు అర్జున్ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు మాదిరిగా అవ్వబోతున్నాడా అంటే ఔను అనే అనిపిస్తుంది. ప్రస్తుతం బన్నీ చేతిలో పలు కంపెనీల ఒప్పందాలు ఉన్నాయి. టాలీవుడ్ లో అత్యధిక యాడ్స్ లో కనిపిస్తున్న హీరోల జాబితాలో అల్లు అర్జున్ రెండవ స్థానంలో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
ముందు ముందు అల్లు అర్జున్ మరిన్ని కంపెనీలతో ఒప్పందం చేసుకునే అవకాశాలు కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ మొదలుకుని ప్రతి రంగంలో కూడా అల్లు అర్జున్ తన ముద్రను వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే తన వద్దకు వచ్చిన.. జెన్యూన్ అనిపించిన దాదాపు అన్నిసంస్థలను ప్రమోట్ చేసేందుకు ఓకే చెబుతున్నాడట.
ఇటీవలే అల్లు అర్జున్ ఒక పైపుల సంస్థ ను ప్రమోట్ చేసేందుకు ఒప్పందం చేసుకున్నాడు. అందుకు సంబంధించిన యాడ్ లో నటించాడు. కొన్ని రోజుల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో కంపెనీ కోసం యాడ్ లో నటించాడు. ఇలా వరుసగా యాడ్స్ తో అల్లు అర్జున్ బిజీ అవ్వడం ను అభిమానులు స్వాగతిస్తున్నారు.
పుష్ప తో పాన్ ఇండియా స్థాయి ని దక్కించుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 తో మరో భారీ విజయాన్ని పాన్ ఇండియా రేంజ్ లో కనుక దక్కించుకుంటే.. ఆయన బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా మరింత బిజీ అయ్యే అవకాశాలు లేకపోలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పుష్ప 2 సూపర్ హిట్ అయితే మహేష్ బాబును కూడా క్రాస్ చేసి బ్రాండ్ అంబాసిడర్ గా సౌత్ లో టాప్ పొజీషన్ లో అల్లు అర్జున్ నిలవడం ఖాయం అన్నట్లుగా అభిమానులు మరియు మెగా కాంపౌండ్ వర్గాల వారు చర్చించుకుంటున్నారు. పుష్ప 2 సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభించబోతున్నట్లుగా దర్శకుడు సుకుమార్ ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.