బన్నీ ఖాతాలో ఇంకో రికార్డు

Update: 2015-10-24 08:41 GMT
పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినంత మాత్రాన ఏ హీరో అయినా స్టార్ అయిపోతాడని అనుకోలేం. భారీ బ్యాగ్రౌండుతో సినిమాల్లోకి అడుగుపెట్టి ఎటూ కాకుండా పోయిన హీరోల ఉదాహరణలు మనకు కొత్తేం కాదు. బ్యాగ్రౌండ్ ను బాగా వాడుకుని.. స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడం, సినిమా సినిమాకు స్థాయి పెంచుకోవడం కొద్దిమందికే సాధ్యమవుతుంది. అల్లు అర్జున్ ఆ కోవకే చెందుతాడు. ‘గంగోత్రి’ సినిమా చూసినపుడు బన్నీ ఇప్పుడున్న స్థాయికి వస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. ముందు తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకున్నాడు. తర్వాత స్టార్ అయ్యాడు. ఇప్పుడు సూపర్ స్టార్ రేంజి దిశగా దూసుకెళ్తున్నాడు. టాలీవుడ్ లో మరే హీరోకూ లేని రికార్డులు అతడి ఖాతాలో ఉండటం విశేషం.

డివైడ్ టాక్ ‌తో మొదలైన సన్నాఫ్ సత్యమూర్తి కూడా 50 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టిందంటే అందుకు బన్నీ ఇమేజే కారణం. తెలుగులో వరుసగా రెండు 50 కోట్ల సినిమాలిచ్చిన ఏకైక కథానాయకుడు బన్నీనే కావడం విశేషం. అంతే కాదు.. వరుసగా నైజాంలో ఐదు పది కోట్ల సినిమాలు ఖాతాలో వేసుకున్న రికార్డు కూడా బన్నీదే కావడం విశేషం. హీరోగా నటించిన మూడు సినిమాలతో పాటు గెస్ట్ రోల్స్ చేసిన రెండు కూడా కలిపితే వరుసగా బన్నీ సినిమాలు ఐదు నైజాంలో పది కోట్ల క్లబ్బులో అడుగుపెట్టాయి. ముందుగా 2013లో ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాతో ఈ క్లబ్బును అందుకున్నాడు బన్నీ. ఆ తర్వాత ఎవడు - రేసుగుర్రం - సన్నాఫ్ సత్యమూర్తి కూడా ఆ ఘనత సొంతం చేసుకున్నాయి. తాజాగా బన్నీ గెస్ట్ రోల్ చేసిన ‘రుద్రమదేవి’ కూడా నైజాంలో పది కోట్ల మార్కును దాటి బన్నీకి అరుదైన రికార్డును అందించింది.
Tags:    

Similar News