బన్నీ విక్రమ్ ఏంటీ సస్పెన్స్!

Update: 2018-07-31 06:51 GMT
నా పేరు సూర్య ఫలితం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని పూర్తి డిఫెన్స్ లో పడేసిందన్నది కళ్ళ ముందు కనిపిస్తున్న నిజం. అది విడుదలై రెండు నెలలు దాటి బన్నీ ఫ్యాన్స్  దాని గురించి మర్చిపోయినా కొత్త సినిమా మొదలుపెట్టడం గురించి ఇంకా ఏ నిర్ణయం వెలువడటం లేదు. కొద్దిరోజులు 24 ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో త్వరలోనే స్టార్ట్ అవుతుందనే ప్రచారం జరిగినా దాని గురించి అధికారిక ప్రకటన ఏది వెలువడలేదు. స్క్రిప్ట్ దశలోనే ఉందని ఓ కొలిక్కి రావడానికి టైం పడుతుందని వార్తలు కూడా వచ్చాయి. కానీ మొన్న గీత గోవిందం ఆడియో వేడుకలో  తన కొత్త సినిమా గురించి అభిమానులు  అల్లు అర్జున్ ని  అడిగినప్పుడు నాకే తెలియదు కన్ఫర్మ్ అయ్యాక చెబుతాను అని తప్పుకోవడం చూస్తుంటే విక్రమ్ ని కూడా అల్లు అర్జున్ హోల్డ్ లో పెట్టేసాడని అర్థమైపోతోంది. మరి అది కథ గురించా లేక విక్రమ్ ఎలా డీల్ చేస్తాడా అనే అనుమానం వల్లనా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

సరైనోడు తర్వాత అల్లు అర్జున్ తన రేంజ్ హిట్ అందుకోలేదు. డీజే కమర్షియల్ గా పాస్ అనిపించుకున్నా  దాని కలెక్షన్ల విషయంలో జరిగిన రచ్చ చిన్నదేమీ కాదు. ఇక వక్కంతం వంశీని ఎంతో నమ్మి ఇష్టపడి కష్టపడి చేసిన నా పేరు సూర్య కనీసం కాస్ట్ కూడా రాబట్టుకోలేకపోయింది. అందుకే బన్నీ  ఆంధ్ర-తెలంగాణ -కేరళ ఇలా  మూడు రాష్ట్రాల్లో బలమైన మార్కెట్ ఉన్న తాను అనవసర రిస్క్ చేస్తే ఇబ్బందుల్లో పడతాను అని గుర్తించే విక్రమ్ కుమార్ ది హోల్డ్ లో పెట్టినట్టుగా కనిపిస్తోంది. మరి కథ ఓకే అయ్యాక చెబుతాడా లేకా విక్రమ్ కన్నా మంచి కథతో వేరే దర్శకుడు వస్తాడని బన్నీ వెయిట్ చేస్తున్నాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. పోనీ నేరుగా విక్రమ్ నే అడుగుదాం అంటే తన సినిమా షూటింగ్ అయ్యాక తప్ప మామూలు టైం లో దొరకని అతని నుంచి సమాధానం రావడం కష్టం
Tags:    

Similar News