బన్నీ ట్వీటేయకపోతే రచ్చ అక్కర్లేదు

Update: 2018-03-19 16:40 GMT
ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న మెగా ఫ్యాన్స్ రంగస్థలం హంగామా ఉగాధితో మొదలైంది. ఆదివారం ప్రీ రిలీజ్ వేడుకతో సినిమాపై అంచనాలు పెరగడం మొదలయ్యాయి. దర్శకుడు సుకుమార్ అలాగే హీరో రామ్ చరణ్ వారి స్పీచ్ లతో జనాలని ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక మెగాస్టార్ అయితే సినిమాకి నేషనల్ అవార్డ్ వచ్చి తీరాలి అనే లెవెల్లో స్పీచ్ తో అదరగొట్టాడు. ఇకపోతే ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మొదలైంది. సినిమా తారలు కూడా ట్రైలర్ బావుందని కామెంట్ చేస్తున్నారు. దాదాపు మెగా ఫ్యామిలీ లో అందరు సోషల్ మీడియా ద్వారా వారి స్పందనను తెలియజేశారు.  కాని ఒక్కరి సైలన్స్ ఇప్పుడు పెద్ద టాపిక్ అయిపోయింది.

అసలు రంగస్థలం ట్రైలర్ ఎలా ఉంది అనే విషయంపై అల్లు అర్జున్ మాత్రం మాత్రం స్పందించలేదు. స్టైలిష్ స్టార్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం బిజీగా ఉన్నట్లు వార్తలు బాగానే వస్తున్నా ఒక్క ట్వీట్ వేయడానికి సమయం లేదా అని కామెంట్ చేస్తున్నారు మెగాభిమానులు. సాధారణంగా బన్నీ మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరి సినిమాకు ఎదో విధంగా విషెస్ అందిస్తారు. ముఖ్యంగా రామ్ చరణ్ సినిమాకు తప్పకుండా ఓ ట్వీట్ వేస్తాడు. కానీ రంగస్థలం సినిమాకు వేయలేదు. అందులోను సుకుమార్ తెరకెక్కించిన సినిమా. వారిద్దరి రిలేషన్ ఏ విధంగా ఉంటుందో తెలిసిందే.. అనేది వారి వాదన. కాని అక్కడే అందరూ ఒక విషయం తెలుసుకోవాలి.

బన్నీ ఓ విధంగా ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. నా పేరు సూర్య సినిమాను ఈ రోజే ఫినిష్ చేశాడు. ఒక ప్రక్కన తను అంత పెద్ద సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నప్పుడు.. పక్కనే ఈ సినిమా గురించి చెప్పలేదు అనడం దారుణం. అసలు ఇప్పుడు వరకు రంగస్తలంపైన కామెంట్స్ వేసిన సెలబ్రిటీలు.. అలాగే ఈ కొంతమంది అభిమానులు.. అసలు నా పేరు సూర్య గురించి ఎంత మాట్లాడారేంటి? అలా ఘాటుగా కాకపోయినా.. అసలు బన్నీ ట్వీట్ వేయకపోతే రచ్చ చేయక్కర్లేదు. అది సంగతి.


Tags:    

Similar News