అల్లు అర్జున్ నోట్లో వెండి చెంచాతో పుట్టినవాడు. అతను కోరుకుంటే ఏ హార్లీ డేవిడ్ సన్ బైకు వచ్చి ఇంటి ముందు వాలేదిలే అనుకుంటాం. కానీ అల్లు అరవింద్ మాత్రం తన కొడుకు ఎంత మారాం చేసినా బైకే కొనివ్వలేదట. ఎంత సంపాదించినా టీనేజ్లో తాను బైకు మీద చక్కర్లు కొట్టలేదన్న అసంతృప్తి మాత్రం ఉందంటున్నాడు బన్నీ.
‘‘నాకు చిన్నతనంలో పెద్దగా బైక్ నడిపిన అనుభవం లేదు. చాలాసార్లు బైక్ కొనివ్వమని అని అడిగినా.. మా నాన్న నా కోరిక తీర్చలేదు. పద్దెనిమిమిదేళ్లు దాటినప్పటి నుంచి కారు వాడుతున్నాను. సినిమాల్లో పేరు తెచ్చుకున్నాక బైకు మీద బయట తిరగడానికి అవకాశం లేకపోయింది. నేను మొదట బైక్ నడిపింది బన్నీ సినిమాలో. హ్యాపీ సినిమాలో బైకుతో చేసే స్టంట్ సీన్స్ ఉన్నాయి. ఆ సినిమా వల్లే నాకు బైక్ డ్రైవింగ్ మీద పట్టు దొరికింది. తర్వాత నుంచి ప్రతి సినిమాలోనూ బైక్ డ్రైవ్ చేస్తున్నా. విశేషం ఏంటంటే నేను సినిమాలో తప్ప ఇండియాలో బయట ఎప్పుడూ డ్రైవ్ చేయనే లేదు. ఈ మధ్యే విదేశాల్లోని రోడ్లపై డ్రైవ్ చేశా. అప్పుడప్పుడూ మా ఫాంహౌస్ దగ్గర్లోని ఓ రోడ్డుపై బైక్ డ్రైవ్ చేస్తుంటా’’ అంటూ తన బైక్ రైడింగ్ హిస్టరీ అంతా చెప్పుకొచ్చాడు బన్నీ.
ఐతే సమయం సందర్భం లేకుండా ఈ బైక్ డ్రైవింగ్ సంగతులేంటి అనుకోకండి. మనోడు ప్రస్తుతం హీరో బైక్స్ బ్రాండ్ అంబాసిడర్. ఓ కొత్త బైక్ లాంచింగ్ సందర్భంగా హైదరాబాద్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ సంగతులన్నీ మీడియాతో పంచుకున్నాడు. స్పీడ్ కన్నా.. సేఫ్టీ ముఖ్యమని.. అందరూ తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని ఓ మంచి మాట కూడా చెప్పాడు బన్నీ.