బన్నీ ఇంత కష్టం ఎప్పుడూ పడలేదట

Update: 2015-10-05 11:30 GMT
‘రుద్రమదేవి’ సినిమాలో తాను చేసింది అతిథి పాత్రే కానీ.. దాని కోసం హీరోగా చేసిన సినిమాలకు పడ్డ కష్టం కంటే ఎక్కువే పడ్డానని అంటున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ‘రుద్రమదేవి’లో తాను చేసిన గోన గన్నారెడ్డి పాత్ర కెరీర్ లో ఎప్పటికీ గుర్తుంచుకునే పాత్ర అవుతుందని బన్నీ చెప్పాడు. ఈ పాత్ర చేసి తానేమీ గుణశేఖర్ కు సాయం చేయలేదని.. ఇంతమంచి పాత్ర ఇచ్చినందుకు తానే గుణశేఖర్ కు రుణపడి ఉంటానని బన్నీ చెప్పాడు.

‘‘ఇంతకుముందెప్పుడూ నేను త్రీడీ సినిమాల నటించలేదు. ఇందులో ఎంత కష్టం ఉందో రుద్రమదేవి సినిమాతో తెలిసింది. త్రీడీలో సన్నివేశాలు తీయడానికి చాలా టైం పడుతుంది. పైగా అది చాలా కష్టమైన ప్రక్రియ. ముందు 2డీలో తీసి.. తర్వాత దాన్ని 3డీలోకి మార్చాలి. ఏ చిన్న తేడా వచ్చినా మళ్లీ షూట్ చేయాలి. ఇలాంటపుడు చాలా ఓపిగ్గా వ్యవహరించాలి. పైగా స్టీరియో-స్కోపిక్ అనే కొత్త టెక్నాలజీని కూడా రుద్రమదేవి కోసం ఉపయోగించారు. దాంతో ఇంకా లేటయ్యేది. సుదీర్ఘ సమయం షూటింగ్ చేయాల్సినపుడు చాలా ఓపిగా ఉండాలి. అంత సేపూ ఒకే మూడ్లో ఉంటే.. ఎక్స్ ప్రెషన్స్ క్యారీ చేయాలి. ఇది మాటల్లో చెప్పినంత సులువు కాదు. అందుకే నేను అతిథి పాత్ర చేసినా ఓ పూర్తి స్థాయి సినిమా చేసిన ఫీలింగ్ కలిగింది’’ అన్నాడు అల్లు అర్జున్.

ఓవైపు సన్నాఫ్ సత్యమూర్తి షూటింగ్ జరుగుతున్నప్పటికీ.. డేట్లు సర్దుబాటు చేసుకుని ‘రుద్రమదేవి’లో నటించానని.. రెండు సినిమాలకు వేర్వేరు గెటప్పులు, మేకప్ మెయింటైన్ చేయడం కోసం చాలా కష్టపడ్డానని.. ఐతే తాను పోషించిన గోన గన్నారెడ్డి పాత్ర ఇండస్ట్రీలో తనకెంతో గౌరవం తెచ్చిపెట్టిందని.. ఇలాంటి పాత్ర తనకిచ్చినందుకు గుణశేఖర్ కు థ్యాంక్స్ అని బన్నీ అన్నాడు.
Tags:    

Similar News