స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక పాలసీ ఉంది. తను ఏ సినిమాని ట్విట్టర్ ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ.. పబ్లిక్ గా ప్రశంసించి, పబ్లిసిటీ ఇవ్వడు. అది మంచి సినిమా అయినా, చెడ్డ సినిమా అయినా సరే.. ట్విట్టర్ లో పొగడ్డం మాత్రం జరగదు. ఇప్పటివరకూ బన్నీ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్న రూల్ ఇది. కానీ ఇప్పుడో సినిమా కారణంగా తన సిద్ధాంతాన్ని బన్నీ మార్చుకోవాల్సి వచ్చింది. తన ఒట్టును కాసేపు గట్టు మీద పెట్టి.. క్షణం మూవీని పొగడ్తల్లో ముంచెత్తాడు.
"క్షణం చూసిన తర్వాత.. పబ్లిక్ గా ఓ సినిమా గురించి ట్వీట్ చేయకూడదన్న నా పాలసీని కాసేపు మార్చుకోవాల్సి వచ్చింది. నాకు పర్సనల్ గా ఈ సినిమా చాలా బాగా నచ్చింది. తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం దర్శకులు, నటులు వచ్చి రూపొందిస్తున్న సినిమాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ మరో అడుగు ముందుకు వేసినట్లే. సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా క్షణం" అంటూ ట్వీట్ చేశాడు బన్నీ.
సూపర్బ్ మౌత్ టాక్ తో ఇప్పటికే లాభాలు గడిస్తున్న క్షణం.. కేవలం కోటి రూపాయల బడ్జెట్ తో రూపొందిన సినిమా కావడం విశేషం. ఇప్పుడు అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల నుంచి కూడా ఈ రేంజ్ లో ప్రశంసలు రావడంతో.. మరింతగా వసూళ్లు సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు సిని జనాలు.