పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నెక్ట్స్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ కి డేట్ లాక్ చేసేశాడు. ఏప్రిల్ 8న థియేటర్స్ లోకి వచ్చేస్తున్నట్లు మేకర్స్ తేల్చేశారు. పవన్ మూవీ తో పోటీపడి రిలీజ్ చేసే ధైర్యం ఎవరూ చేయరు కాబట్టి.. పవర్ స్టార్ వచ్చేది సోలోగానే అనేసుకోవచ్చు. మరిప్పుడు అందరి దృష్టి.. సమ్మర్ కి షెడ్యూల్ చేసిన ఇతర సినిమాల పైనే ఉంది. ఈ ఏడాది ఎండాకాలానికి చాలానే సినిమాలు షెడ్యూల్ చేసి ఉంచారు. మహేష్ బాబు బ్రహ్మోత్సవం కూడా అదే టైంకి రావాల్సి ఉంటుంది.
అయితే.. దీనికంటే ముఖ్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న సరైనోడు సంగతే ఆసక్తికరంగా మారింది. సర్దార్ కంటే ముందే.. సరైనోడు రెడీ అయిపోనుంది. అయినా సరే.. సమ్మర్ వరకూ వెయిట్ చేయక తప్పని పరిస్థితి అని చెప్పాల్సిందే. ఎందుకంటే ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం మార్చ్ చివరి వారం వరకూ అందరూ బుక్ చేసేసుకున్నారు. ఇక ఏప్రిల్ - మే నెలల్లోనే అనుకూలమైన డేట్స్ వెతుక్కోవాల్సి ఉంటుంది. అప్పటికే ఫైనల్ ఔట్ పుట్ చేతిలో ఉంటుంది కాబట్టి.. సరైనోడు చిత్రాన్ని కూడా ఏప్రిల్ లోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇది పవర్ స్టార్ చేస్తున్న పక్కా మాస్ మూవీ. అలాగే బోయపాటి డైరెక్షన్ లో బన్నీ చేస్తున్న సరైనోడు కూడా మాస్ ని టార్గెట్ చేసిన మూవీనే.
పోనీ.. పవన్ కోసం ఓ వారం ఆగినా.. ఆ తర్వాత ఏప్రిల్ 14నే కబాలి అంటూ రజినీకాంత్ కూడా వచ్చేస్తాడు. ఈ రెండింటినీ తర్వాత వచ్చి, వాటిని హవాని తట్టుకుని నిలబడాల్సిన సిట్యుయేషన్ లో సరైనోడు ఉంటాడు. మరి వరుసగా ఇన్ని మాస్ మూవీస్.. అందులోనే రెండు మెగా ఫ్యామిలీ మూవీస్ అంటే.. ఒకరితో ఒకరు పోటీ పడక తప్పని పరిస్థితి వస్తుందా అనుకుంటున్నారు టాలీవుడ్ జనాలు.