ఫేస్ బుక్ - ట్విట్టర్ లో ప్రమోషన్ ఇప్పుడు పాపులర్ ట్రెండ్. వీటి ద్వారా బోలెడంత పాపులారిటీ ఈజీగా వచ్చేస్తోంది. తమ సినిమాలకు ప్రచారం చేసుకోవాలంటే సులువైన మార్గంగా దీన్ని భావిస్తున్నారంతా. ఇటీవలి కాలంలో రాజమౌళి బాహుబలి ప్రమోషన్ కి ఫేస్ బుక్ నే అనుసరించారు. ఈ చిత్రానికి అసాధారణమైన క్రేజు తీసుకు రావడంలో ఫేస్ బుక్ - ట్విట్టర్ ప్రమోషన్ అక్కరకొచ్చింది. అలాగే మహేష్ శ్రీమంతుడు ప్రమోషన్ ఫేస్ బుక్ లోనే జరిగింది. ప్రస్తుతం బ్రహ్మోత్సవం ప్రచారాన్ని ఫేస్ బుక్ లోనే చేస్తున్నాడు మహేష్. అయితే ఫేస్ బుక్ లో టాప్ 1 పొజిషన్ లో కొనసాగుతున్నాడు బన్ని. ఆ తర్వాతి స్థానాల్లో ప్రభాస్ - మహేష్ - నాని - చరణ్ ఉన్నారు.
అల్లు అర్జున్ ఫేస్ బుక్ లైక్ లు 91 లక్షలు. అంతమంది అతడిని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు. ప్రభాస్ కి 43 లక్షల లైక్ లు వచ్చాయి. మహేష్ కి 33 లక్షల లైక్ లు ఉన్నాయి. నానికి 33 లక్షలు, రామ్ చరణ్ కి 30 లక్షలు ఫేస్ బుక్ లైక్ లు ఉన్నాయి. ఈ ఐదుగురు టాప్ 5 పొజిషన్ లో కొనసాగుతున్నారు. ఆ తర్వాత.. రానా - ఎన్టీఆర్ - నితిన్ - రవితేజ - వెంకటేష్ - అఖిల్ - జగపతిబాబు - వరుణ్ తేజ్ - బాలకృష్ణ - అల్లు శిరీష్ - సంపూర్ణేష్ - వరుణ్ సందేశ్ - నాగచైతన్య - కళ్యాణ్ రామ్ - రామ్ - సాయిధరమ్ .. ఇంతమంది ఫేస్ బుక్ లో అభిమానుల్ని సంపాదించుకున్నారు. రాజమౌళికి ప్రత్యేకించి ఫేస్ బుక్ లో ఫాలోవర్స్ ఉన్నారు. అదీ మ్యాటరు.