సూర్య.. బన్నీ వన్ మ్యాన్ షో

Update: 2018-05-04 04:32 GMT
నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా.. అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఈ లేటెస్ట్ మూవీ ఇవాళే థియేటర్లలోకి వచ్చింది. ఇంకా కథా కథనాల సంగతి అప్పుడే చెప్పలేం కానీ.. ఈ సినిమాకు ముందు నుంచి అంతా వన్ మ్యాన్ షో అయిపోయింది.

ఈ మధ్య కాలంలో కాంబోలకే క్రేజ్ ఎక్కువగా ఉంటోంది. హీరో.. హీరోయిన్.. మ్యూజిక్ డైరెక్టర్.. ఇలా అందరూ క్రేజీగా ఉండేలా చూసుకుంటున్నారు. కానీ స్టైలిష్ స్టార్ మాత్రం.. నా పేరు సూర్య మూవీని తన ఒక్కడి భుజస్కంధాల పైనే వేసుకున్నారు. స్టార్ డైరెక్టర్ లేడు.. పెద్ద ప్రొడక్షన్ హౌస్ లేదు.. ఓ రకంగా చూస్తే భారీ ప్రచారాలు కూడా లేవు. అను ఇమాన్యుయేల్ స్టార్ హీరోయిన్ కూడా కాదు. సంగీత దర్శకద్వయం విశాల్-శేఖర్ గురించి మన తెలుగు ఆడియన్స్ కు ఏ మాత్రం తెలియదు. ఎలా చూసినా ఒక్క యాంగిల్ లో కూడా నా పేరు సూర్య చిత్రాన్ని బన్నీ ఒక్కడే భారం మోయాల్సి ఉంది.

మూవీకి ఎట్రాక్టింగ్ పాయింట్ స్టైలిష్ స్టార్ మాత్రమే. అందుకే మొదటగా సీరియస్ ఎమోషన్స్.. ఆ తర్వాత రొమాంటిక్ యాంగిల్.. చివరగా బన్నీ అసలు సిసలు స్ట్రెంగ్త్ అయిన డ్యాన్సులు.. ఇలా తమ చిత్రంలో ఏమేం ఉన్నాయో అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి చొప్పున టీజర్ల ద్వారా చూపించారు. ప్రస్తుతం బన్నీ ఫామ్ ప్రకారం.. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చినా సూపర్ హిట్ అవడం ఖాయం. ఇక టాక్ బాగుంటే మాత్రం.. కొత్త రికార్డుల వేట స్టార్ట్ అయినట్లే.
Tags:    

Similar News