టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ 'పుష్ప: ది రైజ్' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించారు. తెలుగుతో పాటుగా హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో విడుదలై ఈ సినిమా దాదాపు అన్ని ఏరియాలలో మంచి వసూళ్ళు రాబట్టింది. ముఖ్యంగా హిందీ మరియు తమిళ వెర్సన్స్ అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టాయి.
'పుష్ప' పార్ట్-1 చిత్రాన్ని తమిళ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ రిలీజ్ చేసింది. కోవిడ్ పరిస్థితులుల్లో భారీ ధరకు తమిళ థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేసిన లైకా.. ఈ సినిమాతో సేఫ్ జోన్ లోకి వచ్చారు. ఒకవేళ నష్టపోయినా లైకా తరపున నిలబడతానని మూవీ ప్రమోషన్స్ సమయంలో బన్నీ హామీ ఇచ్చినట్లు టాక్.
'పుష్ప: ది రైజ్' సినిమా తమిళ్ లో లాభాల బాట పట్టిన నేపథ్యంలో శుభాస్కరన్ లైకా ప్రొడక్షన్స్ లో అల్లు అర్జున్ ఓ సినిమా చేయడానికి మాట ఇచ్చాడట. ఇది ఎప్పుడు ఉంటుందో తెలియనప్పటికీ.. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కే అవకాశం ఉంది.
భారీ బడ్జెట్ సినిమాలకు పేరు గాంచిన లైకా సంస్థ.. ప్రస్తుతం 'పొన్నియన్ సెల్వన్' వంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తోంది. అలానే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని తమిళ్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా కోసం సరైన స్క్రిప్ట్ మరియు దర్శకుడి కోసం వెతుకులాట ప్రారంభించిందట.
బన్నీ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే 'పుష్ప: ది రూల్' సినిమా మీద దృష్టి పెట్టనున్నారు. దీని తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఓ మాస్ మూవీ చేయనున్నారు. ఇప్పుడు తమిళ ప్రొడక్షన్ హౌస్ కోసం ఓ ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. మరి ఈ సినిమా రావడానికి ఎన్నేళ్ళు పడుతుందో చూడాలి.