అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషనల్ లో తెరకెక్కిన హ్యాట‍్రిక్ మూవీ ''పుష్ప: ది రైజ్''. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబడుతోంది. టాక్ తో సంబంధం లేకుండా పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లోనూ సత్తా చాటుతోంది.
''పుష్ప: ది రైజ్'' మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ వీక్ లో రూ. 229 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలానే కేరళలో 10 రోజుల్లోనే రూ. 10.25 కోట్లు రాబట్టినట్లు చిత్ర బృందం తెలిపింది. మాలీవుడ్ లో బన్నీ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుందనే సంగతి తెలిసిందే. ఇప్పుడు 'పుష్ప' పార్ట్-1 తో మరోసారి అక్కడ తన ఆధిపత్యాన్ని కొనసాగించారు.
కేరళలో 50% ఆక్యుపెన్సీతోనే 'పుష్ప' సినిమా ఈ స్థాయిలో పది రోజుల్లోనే 10 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. 'బాహుబలి' చిత్రాల తర్వాత ఈ ఘనత సాధించిన తెలుగు డబ్బింగ్ సినిమాగా 'పుష్ప: ది రైజ్' రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక హిందీ ఇండస్ట్రీలోనూ అల్లు అర్జున్ సినిమా మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. ఇప్పటి వరకు రూ. 32.95 కోట్లు వసూళ్లతో సెకండ్ వీక్ లోనూ ప్రభావం చూపిస్తోంది.
అలానే 10వ రోజు కూడా నైజాం లో పుష్ప హవా కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. క్రిస్మస్ సందర్భంగా కొత్త సినిమాలు రిలీజ్ అయినా 'పుష్ప: ది రైజ్' భారీ వసూళ్లు సాధిస్తుండటం గమనార్హం. ఆన్ లైన్ టికెట్ బుకింగ్ పోర్టల్ 'బుక్ మై షో'లో కేవలం 8 రోజుల్లోనే ఈ సినిమా 35 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. తెలుస్తుంది. 2021లో విడుదలైన ఏ తెలుగు సినిమాకు ఇన్ని బుకింగ్స్ జరగలేదని తెలుస్తోంది.
కాగా, శేషాచల అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో 'పుష్ప' సినిమాను తెరకెక్కించారు. ఇందులో పుష్పరాజ్ అనే ఊరమాస్ పాత్రలో అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో చేశారు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సమంత స్పెషల్ సాంగ్ లో అలరించింది. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ - అనసూయ భరద్వాజ్ - సునీల్ - ధనుంజయ - అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు.
దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో 'పుష్ప' చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా రెండో భాగం 'పుష్ప: ది రూల్' వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది.