బన్నీ ఎంతలా మారిపోయాడంటే..?

Update: 2016-04-17 06:20 GMT
మార్పు మనిషికి మామూలే. కానీ.. తనలో వచ్చిన మార్పును ఎవరికి వారు గుర్తించటం కాస్త తక్కువే. ఓపక్క భారీ క్రేజ్.. స్టార్ డమ్ తో ఉండే ఒక యువ హీరో తనలోని మార్పు గురించి ఎప్పటికప్పుడు గమనించుకోవటం.. తానెంతో మారాడన్న విషయాన్ని ఎలాంటి శషబిషలు లేకుండా ఓపెన్ గా చెప్పటం కాస్త కష్టమే. కవర్ చేసుకుంటూ గొప్పలు మాత్రమే చెప్పుకునే టాలీవుడ్ లో.. కాస్త ఓపెన్ గా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే హీరోలు తక్కువే. అలా ఓపెన్ గా మాట్లాడే కథానాయకుల్లో ఒకరైన అల్లు అర్జున్ తనలో వచ్చిన మార్పుల గురించి వరుసగా చెప్పుకొచ్చాడు.

బన్నీలో వచ్చిన మార్పుల్ని చూస్తే.. ఇంతగా మారిపోయాడా? అని అనిపించక మానదు. ఇక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనలో వచ్చిన మార్పుల గురించి వరుసగా చెప్పుకొచ్చాడు. అదేంటో చూస్తే..

‘‘ఈ మధ్యన చరణ్ కలిశాడు. ఏంటి.. ఈ మధ్య సీరియస్ గా తయారయ్యావ్. గతంలోలా జోవియల్ గా ఉండటం కాస్త తగ్గిందన్నాడు. నాకు.. ఒక్కసారి ఆశ్చర్యం వేసింది. ఏంటి.. నేను మారానా? అని అనిపించింది. కాసేపు చరణ్ మాటల్ని ఆలోచిస్తూ ఉండిపోయా. నిజంగానే అప్పుడనిపించింది. ఇప్పుడు  కొత్తగా మారటం ఏమిటి? మార్పు మొదట్నించి ఉన్నదే కదా అని అనిపించింది’’

‘‘పగలూ రాత్రీ కష్టపడి చదివినా పాస్ మార్కుల కోసం పడే తపన. అలా మొదలై పదో తరగతి ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ కావటం ఓ పెద్ద  మార్పు. జీవితంలో పెద్ద మార్పు. సినిమాల్లోకి వస్తానని అస్సలు అనుకోలేదు. అలాంటి హీరోగా ఇప్పుడున్న స్థాయి. తెల్లవారుజాము వరకూ సాగే పార్టీలతో హడావుడిగా ఉండే జీవితంలో.. రాత్రి పది.. మ్యాగ్జిమమ్ పదకొండు దాటితే పార్టీలు బంద్. ఫ్రెండ్స్ పిలిస్తే పరిగెత్తుకెళ్లే వాడ్ని. ఇప్పుడు పిలిచినా ఫ్యామిలీతోనే వెళ్లటం. ఎనిమిది మంది కజిన్స్ లో నాకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం తపించేవాడ్ని. ఇప్పుడు స్టార్ స్టేటస్.. మొత్తంగా చూస్తే.. మార్పు మొదలై చాలా కాలమే అయ్యింది. మార్పు లేకపోతే లైఫ్ ఏముంటుంది?’’ అంటూ తనలో వచ్చిన మార్పుల గురించి చాలానే చెప్పేశాడు కదూ.
Tags:    

Similar News