హ‌ను కి బ‌న్ని క్రేజీ ఆఫ‌ర్

Update: 2018-12-18 05:31 GMT
యాక్ష‌న్ ప్యాక్డ్ సినిమాలు చేసే అల్లు అర్జున్ ప్రేమ‌క‌థా చిత్రాల్లో న‌టిస్తాడా? ప‌్యూర్‌ ల‌వ్ స్టోరీ లు బ‌న్నికి సూట‌బులేనా?  ఆర్య త‌ర‌హా ప్రేమ‌క‌థ‌లు త‌ప్ప రెగ్యుల‌ర్- రొటీన్ ల‌వ్ స్టోరీలు ఈ బాడీ బిల్డ‌ర్ కి సూట‌వుతాయా?  ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ డిబేట్ ఇది. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా కోసం వేచి చూస్తున్న బ‌న్ని ఉన్న‌ట్టుండి ల‌వ్ స్టోరి కావాల‌ని అడ‌గ‌డం షాకిస్తోంది. స్టైలిష్ స్టార్ అభిమానుల్లోనే దీని పై ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. బ‌న్ని బాడీ లాంగ్వేజ్ కి ప్యూర్ ల‌వ్ స్టోరిలు ఎంత‌వ‌ర‌కూ యాప్ట్? అన్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

సోమ‌వారం సాయంత్రం `ప‌డి ప‌డి లేచే మ‌న‌సు` ప్రీరిలీజ్ ఈ వెంట్లో బ‌న్ని కోరిన కోరిక టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో హాట్ డిబేట్ కి కార‌ణ‌మైంది. హ‌ను ద‌ర్శ‌క‌త్వం లో క‌చ్ఛితంగా మంచి ల‌వ్ స్టోరి చేయాలి అని బ‌న్ని త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టారు. మాతోనూ ల‌వ్ స్టోరిలు చేయండి!! అంటూ హ‌నూని వేదిక‌ పైనే రెక్వ‌స్ట్ చేశాడు బ‌న్ని. త‌న‌ తో అలాంటి ప్ర‌య‌త్నం చేయాల‌నుకుంటే.. అంత‌కుముందే ఆ ఛాన్స్‌ శ‌ర్వా కొట్టేశాడు.. అంటూ జెల‌సీ పీల‌య్యాడు.

హ‌ను తెర‌కెక్కించిన చిత్రాల్ని ప్ర‌స్థావించిన బ‌న్ని వాటిలో ప్రేమ స‌న్నివేశాలు త‌న‌ని క‌దిలించేశాయ‌ని అన్నాడు. అందాల రాక్ష‌సి- కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాధ చిత్రాల్లో ల‌వ్ సీన్స్ త‌న మ‌న‌సును తాకాయ‌ని చివ‌రికి - లై సినిమాలోనూ ల‌వ్ ఎపిసోడ్స్ మాత్రం త‌న‌ను ట‌చ్ చేశాయ‌ని చెప్పాడు. త‌న‌తో సినిమా తీయాల‌ని అంత పెద్ద స్టార్ కోరుకున్నాడు కాబ‌ట్టి హ‌ను రాఘ‌వ‌పూడి ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటాడా?  ప్రేమ‌క‌థ‌ల్ని ఘాడమైన అనుభూతితో తెర‌కెక్కించే ట్యాలెంటెడ్ గ‌య్ అన‌డంలో ఎలాంటి డౌట్ లేదు. రాతిని నాతిగా మ‌లిచేవాడిని శిల్పి అంటారు. అలానే బ‌న్ని  ర‌గ్గ్ డ్ బాడీ లాంగ్వేజ్ ని ప్యూర్ ల‌వ్ స్టోరీ కి సూట‌య్యేలా మార్చే సత్తా మ‌న ద‌ర్శ‌కుల‌కు ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. హ‌ను ఆ ప‌ని చేస్తాడ‌నే భావిద్దాం.
Tags:    

Similar News