'సంక్రాంతికి వస్తున్నాం'.. సెన్సేషనల్ అడ్వాన్స్ బుకింగ్స్..!

Sensational Advance Sales For Sankranthi Ki Vastunnam

Update: 2025-01-12 14:29 GMT

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందిన ''సంక్రాంతికి వస్తున్నాం'' సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. 'ఎఫ్ 2' 'ఎఫ్ 3' వంటి కమర్షియల్ విజయాల తర్వాత వీరిద్దరి కలయికలో వస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ మెటీరియల్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచి సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. పర్ఫెక్ట్ ఫెస్టివల్ కంటెంట్ తో రాబోతున్నట్లు ట్రైలర్ తో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. దీంతో రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ మూవీ ట్రెండ్ క్రియేట్ చేస్తోంది.

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా జనవరి 14వ తేదీన థియేటర్లలోకి రాబోతోంది. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ బుకింగ్స్ అద్భుతంగా జరుగుతున్నాయి. బుక్ మై షో ఆన్ లైన్ టికెట్ బుకింగ్ యాప్ లో ఈ మూవీ ట్రెండింగ్ లో ఉంది. ఇంకా 2 రోజులు మిగిలి ఉండగానే, హైదరాబాద్ లో అడ్వాన్స్ సేల్స్ ద్వారా 1.6 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. యూఎస్ఏతో సహా అనేక ఇతర ప్రాంతాల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. నైజాంలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇంక ఆంధ్రాలో ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. ఇది ఖచ్చితంగా వెంకటేష్ కెరీర్‌లోనే అతిపెద్ద ఓపెనింగ్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది హౌస్ ఫుల్ సంక్రాంతి అవుతుందని భావిస్తున్నారు.

గతంలో వెంకటేష్ నటించిన చాలా సినిమాలు సంక్రాంతికి వచ్చి మంచి విజయాలు అందుకున్నాయి. ఫ్యామిలీ కంటెంట్ తో వచ్చిన ప్రతీసారి ఆయనకు బ్లాక్ బస్టర్ హిట్స్ పడ్డాయి. ఈసారి ఫెస్టివల్ కి అన్ని వర్గాలను ఆకట్టుకునే బొమ్మతో రాబోతున్నట్లు 'సంక్రాంతికి వస్తున్నాం' సాంగ్స్, ట్రైలర్ తోనే హింట్ ఇచ్చారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే క్లీన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ తో రాబోతున్నట్లు మేకర్స్ స్పష్టం చేసారు. ప్రమోషన్స్ కూడా చాలా గట్టిగా చేస్తున్నారు. వెంకీ స్వయంగా రంగంలోకి దిగి, ఎన్నడూ లేని విధంగా దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. స్టేజ్ మీద పాట పాడి, డ్యాన్సులు చేస్తున్నారు. ప్రమోషన్స్ ని కూడా జనాలు చాలా ఎంజాయ్ చేస్తున్నారంటేనే, ఈ సినిమాకి ఎలాంటి క్రేజ్ ఉందనేది అర్థం అవుతుంది.

ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్ మధ్య సాగే కథాంశంతో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాని తెరకెక్కించారు. అనిల్ రావిపూడి శైలి ఎంటర్టైన్మెంట్ కి క్రైమ్ ఎలిమెంట్ ని మిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఎంటర్ టైన్మెంట్ చాలా ఫ్రెష్ గా వుంటుందని, క్లైమాక్స్ చాలా సర్ ప్రైజ్ చేస్తుందని చిత్ర బృందం చెబుతోంది. ఇందులో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. ఉపేంద్ర లిమాయే, సాయి కుమార్, నరేష్ వీకే, వీటీ గణేష్, అవసరాల శ్రీనివాస్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ ఈ సినిమాని నిర్మించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చారు. ప్రముఖ సంగీత దర్శకుడు రమణ గోగుల 'గోదారి గట్టు' పాట పాడగా.. వెంకటేష్ 'బ్లాక్ బస్టర్ పొంగల్' సాంగ్ ను ఆలపించడం విశేషం. ఎస్ కృష్ణ & జి ఆదినారాయణ స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా వర్క్ చేసారు. పొంగల్ స్పెషల్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

Tags:    

Similar News