ఫస్ట్ లుక్: బన్నీ సరైనోడు.. అంతే

Update: 2016-01-25 12:41 GMT
బ్రూస్ లీ తర్వాత మెగా అభిమానులు మంచి ఆకలి మీద ఉన్నారు. ఆ తర్వాత వెంటనే వచ్చిన కంచె క్లాస్ మూవీ కావడంతో.. మాస్ జనాలు ఆతృతతో ఉన్నారు. మెగా క్యాంప్ నుంచి సరైన మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ వస్తారన్నారు, చరణ్ చేస్తానన్నాడు.. కానీ రెండూ ఇంకా స్టార్ట్ కాలేదు. దీంతో బాగా నిరుత్సాహంగా ఉన్న మెగాభిమానుల ఆకలి తీర్చడానికి అల్లు అర్జున్ వచ్చేశాడు.

బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బన్నీ చేస్తున్న సరైనోడికి ఫస్ట్ లుక్ విడుదల అయింది. ఓ పెద్ద షాట్ పుట్  బాల్ కి హ్యాండిల్ తగిలించి.. దానితో ఇరగ్గొట్టడానికి రెడీగా ఉన్నాడు బన్నీ. ఈ పోస్టర్ లో అల్లు వారబ్బాయి గెటప్ గురించి కూడా చెప్పుకోవాలి. జీన్స్ ప్యాంట్ లోకి జబ్బలు కనిపించే హాఫ్ హ్యాండ్  షర్ట్ ని ఇన్ షర్ట్ చేసి.. సూపర్ స్టైలిష్ గా ఉన్నాడు అల్లు అర్జున్. హెయిర్ స్టైల్ విషయంలో కూడా మంచి కేర్ తీసుకోవడంతో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు ఈ మెగా హీరో. పైన రెండు గుండీలు విప్పేసి, రఫ్ లుక్ తో పక్కకి చూస్తున్న అళ్లు అర్జున్ చూస్తే.. అప్పుడే రౌడీల రక్తం కళ్ల చూసి వచ్చినట్లుగా ఉంది.

మొత్తం మీద అల్లు అర్జున్ తో రొమాంటిక్ మూవీ చేస్తున్నానని చెప్పిన బోయపాటి శ్రీను.. ఫస్ట్ లుక్ లో మాత్రం తన స్టైల్ కంటెంట్ నే ఆవిష్కరించాడు. ఈ ఫస్ట్ లుక్ తో ఈ మూవీలో యాక్షన్ కి ఎంతగా ఇంపార్టెన్స్ ఉందనే విషయం అర్ధమవుతోంది. బన్నీని ఇంతటి మాస్ అవతారంలో చూసిన మెగా ఫ్యాన్స్.. ఇప్పటికే సంబరాలు స్టార్ట్ చేసేశారు.
Tags:    

Similar News