బన్నీ 100 మిలియన్ రికార్డు లేదా..?

Update: 2018-07-24 05:34 GMT
మన తెలుగు స్టార్ హీరోలంటే మనకెలాగూ అభిమానం ఉంటుంది.... అప్పుడప్పుడూ అది వెర్రితలలు కూడా వేస్తుంటుంది.  కానీ మన స్టార్ హీరోలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా  పొరుగు రాష్ట్రాల్లో.. ఉత్తరాదిలో ఫాలోయింగ్ క్రెడిట్ కార్డు బిల్లులా పెరుగుతూనే ఉంది.  దాంతో మన స్టార్ హీరోల హిందీ డబ్బింగ్ సినిమాలను వాళ్ళు వెర్రెత్తినట్టు చూస్తూ యూట్యూబ్ లో వ్యూస్ కౌంట్ ను విపరీతంగా పెంచుతున్నారు.  అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలకు మరింతగా ఆదరణ లభిస్తోంది.

ఈమధ్య 'సరైనోడు' డబ్బింగ్ వెర్షన్ కు ఒక యూట్యూబ్ ఛానల్ లో 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి.  ఇలాంటి ఫీట్ భారతదేశంలో మరో సినిమా సాధించలేదు.. దీంతో అల్లు అర్జున్ పేరు  మీడియాలో మార్మోగింది.  ఫ్యాన్స్ కుడా సంబరాలు చేసుకున్నారు.  ఖాన్లు.. కపూర్ల నుండి  సౌత్ లో రజినీకాంత్ దాకా ఇంతమంది మహా మహా స్టార్లు కూడా ఈ ఫీట్ సాధించలేదు కాబట్టి వాళ్ళ ఆనందానికి అంతులేదు.  కానీ వాళ్ళందరి ఉత్సాహమంతా ఇప్పుడు మళ్ళీ చప్పున చల్లారిపోయింది.  తాజా సమాచారం ప్రకారం సదరు యూట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేసిన సినిమాలను తీసేయడం జరిగిందట. దాదాపు డబ్బింగ్ రైట్స్ కొన్న వాళ్ళే అధికారిక  ఛానల్ లో అప్ లోడ్ చేస్తారు కాబట్టి ఈ సినిమాలను 'ఫేక్ వ్యూస్' కారణంగా తీసేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో కొన్ని సంఘటలను ఇలా జరిగినా - యూట్యూబ్ వారు ఒక వారం రోజుల్లో తిరిగి వాటిని యథాతథంగా ఉంచడం జరిగింది.  కాబట్టి ఒక వారం పది రోజుల వరకూ మనకు ఈ విషయం పై అప్ డేట్ వచ్చే అవకాశం లేదు.  అప్పటి వరకూ బన్నీ 100 మిలియన్ రికార్డ్ 'హోల్డ్' లోకి వెళ్లినట్టే.
Tags:    

Similar News