నా ఫ్యామిలీ పెరుగుతోంది -అల్లు అర్జున్

Update: 2016-07-20 13:03 GMT
తన కొడుకు అల్లు అయాన్‌ జీవితంలో ప్రతీ ఒక్క మూమెంట్ కూడా ఎంతో బాగా సెలబ్రేట్‌ చేసుకోవాలని నిరంతరం తపిస్తుంటాడు అల్లు అర్జున్. అందుకే మనోడు ఎప్పటికప్పుడు తన వైఫ్‌ స్నేహ రెడ్డి తో కలసి ఆయాన్ ను అనేక విధాలుగా ఫోటో షూట్లు చేసి.. అవన్నీ సోషల్ మీడియాలో పెడుతూ తన అభిమానులను అలరిస్తుంటాడు. ఇప్పుడు అలాంటి ఫీట్ మరొకటి చేశాడు.

''మా ఫ్యామిలీ ఇంకాస్త పెరుగుతుండటం చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే మా ఫ్యామిలీలోకి ఇంకో లిటిల్‌ బేబి రాబోతుంది'' అంటూ ఒక ఫోటోను షేర్‌ చేశాడు బన్నీ. తన కొడుకు అయన్‌.. తల్లి స్నేహ కడుపును ముద్దు పెట్టుకుంటున్న ఆ ఫోటో ఎంతో మురిపెంగా ఉంది. పైగా స్నేహ ప్రెగ్నెన్సీ న్యూస్ ను ఇలా తనే సొంతంగా షేర్‌ చేసుకోవడం అనేది ఇంకా పెద్ద విషయం. హీరోలందరూ ఇలాంటి వార్తలను గోప్యంగా ఉంచాలని చూస్తే.. బన్నీ మాత్రం తన లైఫ్‌ ను అనుక్షణం అభిమానులతో షేర్‌ చేసుకుంటూ ఎంజాయ్‌ చేస్తున్నాడు.

కంగ్రాట్స్ అల్లు అర్జున్. త్వరలోనే పండంటి బిడ్డ పుట్టాలని తుపాకి.కాం తరుపున విషెస్ తెలియజేస్తున్నాం.
Tags:    

Similar News